Mahindra Scorpio N : స్కార్పియో- ఎన్ ధర పెంచి.. ఫీచర్స్‌ని కట్ చేసిన మహీంద్రా!
Mahindra Scorpio N features cut : గత నెలలో మహీంద్రా స్కార్పియో ఎన్ ధరలు పెరిగాయి. అయితే.. పలు వేరియంట్లలోని ఫీచర్స్‌ని సంస్థ కట్ చేసిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

Mahindra Scorpio N on road price Hyderabad : కొన్ని రోజుల క్రితం.. స్కార్పియో ఎన్ ధరను పెంచిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ.. ఇప్పుడు ఈ ఎస్‌యూవీలోని ఫీచర్స్‌ని సైలెంట్‌గా కట్ చేసేసింది! ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి లీక్ అయ్యింది. మహీంద్రాకు చెందిన ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ కాస్ట్ రిడక్షన్ ప్రక్రియలో భాగంగా.. ఈ నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి 1 తర్వాత నుంచి వచ్చిన బుకింగ్స్‌కి.. తాజా మార్పులు అమలవుతాయి. ఇంతకీ అసలు ఏ వేరియంట్లో, ఏ ఫీచర్స్ మారాయంటే..
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫీచర్స్ కట్..
మహీంద్రా స్కార్పియో ఎన్ ఎంట్రీ లెవల్ వేరియంట్ జెడ్2ని సంస్థ టచ్ చేయలేదు. జెడ్4, జెడ్6 వేరియంట్లలో మాత్రం ఇప్పుడు ఇక కోల్డ్ గ్లోవ్ బాక్స్ రావట్లేదు. ఇక ఎస్‌యూవీకి చెందిన జెడ్6 వేరియంట్లోనూ కీలక మార్పులు చేసింది మహీంద్రా. గతంలో వచ్చిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇప్పుడు ఇందులో కనిపించదు. జెడ్4లో ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రమే ఇందులో ఉంటుంది.
Mahindra Scorpio N features cut : మరోవైపు.. మహీంద్రా స్కార్పియో ఎన్ జె4 ఫీచర్స్‌లో భారీ మార్పులే కనిపిస్తున్నాయి! గతంలో వచ్చిన ఆడ్రెనోఎక్స్ సూట్, బిల్ట్ ఇన్ అలెక్సా, కలర్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లు ఇప్పుడు ఇందులో కనిపించడం లేదు.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఎస్యూవీ ధరలు పెంచుతున్నట్టు సంస్థ ప్రకటించిన కొన్ని రోజులకే.. ఇలా ఫీచర్స్ కట్ అయ్యాయి అన్న వార్త బయటకి రావడం గమనార్హం. జనవరిలో.. స్కార్పియో ఎన్ ధరను రూ. 39,300 పెంచింది మహీంద్రా అండ్ మహీంద్రా.
Mahindra Scorpio N features : మహీంద్రా స్కార్పియోకు అనేక మార్పులు చేసి, స్కార్పియో ఎన్ని తీసుకొచ్చింది మహీంద్రా సంస్థ. 2022 జూన్‌లో ఇది లాంచ్ అయ్యింది. ఇప్పటివరకు 1 లక్ష సేల్స్ మైలురాయిని తాకింది. స్కార్పియో క్లాసిక్‌తో పాటు ఈ మోడల్ని లాంచ్ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
మహీంద్రా స్కార్పియో ఎన్లో 6 వేరియంట్లు ఉన్నాయి. ఈ ఎస్యూవీ ఎక్స్‌షోరూం ధర ఇప్పుడు రూ. 13.60లక్షలు- రూ. 20.62లక్షల మధ్యలో ఉంది. పెట్రోల్‌తో పాటు డీజిల్ ఆప్షన్లోను లభిస్తోంది. ఇందులో 5 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
సంబంధిత కథనం