Tata Tiago EV price cut : కస్టమర్లకు అదిరిపోయే వార్తను ఇచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్. తమ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా ఉన్న రెండు ఈవీల ధరలను భారీగా తగ్గించింది టాటా మోటార్స్. ఆ రెండు వాహనాలు.. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై ధర ఎంత తగ్గింది? ఇప్పుడెంత ధరకు వస్తున్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియా ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతోంది టాటా మోటార్స్. ఈ సెగ్మెంట్లో అత్యధిక మార్కెట్ షేరు కలిగి ఉన్న సంస్థ ఇదే. మరీ ముఖ్యంగా.. ఎంట్రీ లెవల్ టాటా టియాగో ఈవీకి సూపర్ డిమాండ్ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు.. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌పై రూ. 70వేలు తగ్గించింది టాటా మోటార్స్. ఈ ప్రైజ్ కట్‌తో.. ఇప్పుడు ఇక టాటా టియాగో ఈవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 7.99లక్షలకు చేరింది.
ఇక మరో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్.. టాటా నెక్సాన్ ఈవీపై ఏకంగా రూ. 1.2లక్షల వరకు ధరలను తగ్గించింది టాటా మోటార్స్. ఫలితంగా.. ఇప్పుడు.. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 14.49లక్షలకు పడిపోయింది. లాంగ్ రంజ్ వర్షెన్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 16.99లక్షలుగా ఉంది.
Tata Nexon EV price cut : ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే.. ఇటీవలి కాలంలో.. బ్యాటరీ ప్యాక్‌ల ధరలు దిగొస్తున్నాయి. బ్యాటరీ సెల్స్ కొనుగోలు చేస్తున్న వారికి కాస్త ఉపశమనం దక్కింది. అందుకే.. ఈవీల ధరలను తగ్గించాలని టాటా మోటార్స్ సంస్థ భావించింది.
అయితే.. ఇటీవలే లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ ఇంట్రొడక్టరీ ప్రైజ్‌ని టాటా మోటార్స్ కట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే.. బ్యాటరీ ప్యాక్ ధర తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకునే, లాంచ్ సమయంలో ఆ ధరను ప్రకటించామని సంస్థ చెప్పుకొచ్చింది. అంటే.. ఇప్పట్లో టాటా పంచ్ ఈవీ ధరలు తగ్గవు. అంతేకాకుండా.. ఇంట్రొడక్టరీ ప్రైజ్ ముగిసిన అనంతరం.. ధరలు పెరిగే అవకాశం ఉంది.
Tata motors price cut news : టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీ ధరల తగ్గింపుపై స్పందించారు టాటా మోటార్స్ సీసీఓ (చీఫ్ కమర్షియల్ ఆఫీసర్) వివేక్ శ్రీవత్స.
"ఈవీల ఉత్పత్తిలో బ్యాటరీలకే ఎక్కువ ఖర్చు అవుతుంది. గత కొంతకాలంగా.. బ్యాటరీ ధరలు దిగొస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా తగ్గుతాయని తెలుస్తోంది. దానిని దృష్టిలో పెట్టుకుని, కస్టమర్లకు ఉపశమనాన్ని ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాము. దేశంలో ఈవీల కొనుగోళ్లు గత కొన్నేళ్లుగా పెరిగాయి. కానీ.. ఈవీనే మొదటి ఛాయిస్‌గా ఎంచుకోవాలన్నదే మా లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే మా పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేస్తున్నాము. ఇప్పటికే ఎన్నో ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ వాహనాలు మా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. ఇక ధరలు తగ్గించడంతో.. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీలు కస్టమర్లకు మంచి ఛాయిస్ అవుతాయని ఆశిస్తున్నాము," అని వివేక్ అభిప్రాయపడ్డారు.
Tata EVs price drop : వాస్తవానికి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇప్పుడు.. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియాగో ఈవీలపై ఈ స్థాయిలో ధరలు దిగొస్తుండటం.. కస్టమర్లకు నిజంగా మంచి విషయమే!
సంబంధిత కథనం