Tata Punch EV vs Citroen eC3 : ఈ రెండు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ఏది బెస్ట్?
Tata Punch EV price : టాటా పంచ్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3.. ఈ రెండు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ఏది బెస్ట్? ఇక్కడ తెలుసుకోండి..
Tata Punch EV on road price in Hyderabad : ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో కొత్తగా లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది! స్టైలిష్ డిజైన్‌తో.. ఈ ఈవీ కస్టమర్లను ఆకర్షిస్తోంది. అదే సమయంలో.. సబ్ కాంపాక్ట్ ఈవీ సెగ్మెంట్లో మరో ఎలక్ట్రిక్ వెహికిల్.. సిట్రోయెన్ ఈసీ3కి గట్టిపోటీని ఇస్తోంది టాటా పంచ్ ఈవీ. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది కొంటే బెటర్? ఏది వాల్యూ ఫర్ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా పంచ్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3- ఫీచర్స్..
టాటా మోటార్స్‌కు చెందిన సెకెండ్ జెనరేషన్ “ఆక్టీ. ఈవీ” ప్లాట్‌ఫామ్‌పై ఈ టాటా పంచ్ ఈవీని రూపొందించారు. ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 10.23 ఇంచ్ వర్చ్యువల్ కాక్‌పిట్, వెంటిలెటేడ్ ఫ్రెంట్ సీట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Citroen eC3 on road price in Hyderabad : ఇక సిట్రోయెన్ ఈసీ3లో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వయర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో పాటు 35 ఇతర కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి.
మొత్తం మీద చూస్తే.. టాటా పంచ్ ఈవీ ఫీచర్స్ ముందు.. సిట్రోయెన్ ఈసీ3 ఫీచర్స్ డల్‌గానే కనిపిస్తున్నాయి!
టాటా పంచ్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3- ఇంజిన్, బ్యాటరీ, రేంజ్..
టాటా పంచ్ ఈవీ ఎస్‌యూవీలో రెండు వర్షెన్లు ఉన్నాయి. ఒకటి 25 కడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన మిడ్-రేంజ్ వర్షెన్. దీని రేంజ్ 315 కి.మీలు. రెండోది.. 35 కేడబ్ల్యూహెచ్‌తో కూడిన లాంగ్ రేంజ్ వర్షెన్. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 421 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. స్టాండర్డ్ టాటా పంచ్ ఈవీలో 60 కేడబ్ల్యూ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రొనైజ్ ఏసీ మోటార్ ఉంటుంది. ఇది 114 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. లాంగ్ రేంజ్లో ఉండ 90 కేడబ్ల్యూ మోటార్.. 190 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది.
Tata Punch EV range : టాటా పంచ్ ఈవీలో రెండు ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి.. 7.2 కేడబ్ల్యూ ఫాస్ట్ హోం ఛార్జర్, 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్. 10శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్‌ని కేవలం 56 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు!
మరోవైపు.. సిట్రోయెన్ ఈసీ3లో ఒకటే బ్యాటరీ ప్యాక్ ఉంది. ఫ్రెంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్కి 29.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ మోటర్.. 57 హెచ్‌పీ పవర్‌ని, 143 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇక బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 320కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.
టాటా పంచ్ ఈవీ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3- ధరలు ఎంతంటే..
Citroen eC3 range details : ఇండియాలో టాటా పంచ్ ఈవీ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11లక్షలుగా ఉంది. సిట్రోయెన్ ఈసీ3 ఎక్స్‌షోరూం ధర రూ. 11.61లక్షలుగా ఉంది. పంచ్ ఈవీ టాప్ ఎండ్ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 15.49లక్షలుగా ఉండగా.. సిట్రోయెన్ ఈసీ3 టాప్ ఎండ్ మోడల్ ఖరీదు రూ. 13.50 లక్షలుగా ఉంది (ఎక్స్‌షోరూం).
టాటా పంచ్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర.. సిట్రోయెన్ ఎలక్ట్రిక్ వెహికల్తో పోల్చుకుంటే.. రూ. 60 తక్కువే. కానీ ముగింపు, టాప్ ఎండ్ ధర మాత్రం దాదాపు రూ. 2లక్షలు అధికం! అందుకు తగ్గట్టుగానే.. టాటా పంచ్ ఈవీలో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి.
సంబంధిత కథనం