తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ambrane Wise Roam 2 : లూసిడ్ డిస్‍ప్లేతో బడ్జెట్ ధరలో అంబ్రేన్‍ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్

Ambrane Wise Roam 2 : లూసిడ్ డిస్‍ప్లేతో బడ్జెట్ ధరలో అంబ్రేన్‍ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్

19 April 2023, 9:59 IST

    • Ambrane Wise Roam 2: ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో బ్లూటూత్ కాలింగ్, ఎల్‍సీడీ లూసిడ్ డిస్‍ప్లేతో ఈ వాచ్ వచ్చింది.
Ambrane Wise Roam 2: లూసిడ్ డిస్‍ప్లేతో బడ్జెట్ ధరలో అంబ్రేన్‍ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Ambrane)
Ambrane Wise Roam 2: లూసిడ్ డిస్‍ప్లేతో బడ్జెట్ ధరలో అంబ్రేన్‍ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Ambrane)

Ambrane Wise Roam 2: లూసిడ్ డిస్‍ప్లేతో బడ్జెట్ ధరలో అంబ్రేన్‍ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Ambrane)

Ambrane Wise Roam 2 Smartwatch: ఆంబ్రేన్ వైస్ లైనప్‍లో మరో స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 వాచ్‍ను దేశీయ సంస్థ ఆంబ్రేన్ విడుదల చేసింది. గతేడాది వచ్చిన రోమ్ వాచ్‍కు ఇది సక్సెసర్‌గా అడుగుపెట్టింది. ఐపీఎస్ ఎల్‍సీడీ లూసిడ్ డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఈ ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 వాచ్‍కు హైలైట్లుగా ఉన్నాయి. ఇప్పటికే సేల్‍కు అందుబాటులోకి వచ్చింది. ఈ నయా స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 స్పెసిఫికేషన్లు

Ambrane Wise Roam 2 Smartwatch: 1.39 ఇంచుల IPS LCD లూసిడ్ (Lucid) రౌండ్ షేప్డ్ డిస్‍ప్లేను ఈ ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 500 నిట్స్ బ్రైట్‍నెస్‍కు సపోర్ట్ చేస్తుంది. 240x240 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉంటుంది. డిస్‍ప్లే చుట్టూ బెజిల్స్ తక్కువగానే ఉన్నాయి. 100కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, ఎస్‍పీఓ2 మానిటరింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటింగ్ హెల్త్ ఫీచర్లతో ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 స్మార్ట్‌వాచ్ వచ్చింది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ యాప్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

Ambrane Wise Roam 2 Smartwatch: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 స్మార్ట్‌వాచ్ వచ్చింది. ఇందుకోసం ఈ వాచ్‍లో మైక్రోఫోన్, స్పీకర్ ఉంటాయి. దీంతో బ్లూటూత్ ద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్, కాంటాక్టులను సింక్ చేసుకునే సదుపాయాలు కూడా ఉంటాయి. వాయిస్ అసిస్టెంట్‍లకు కూడా ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

Ambrane Wise Roam 2 Smartwatch: ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 10 రోజుల వరకు ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 వాచ్‍ను వాడుకోవచ్చని ఆంబ్రేన్ పేర్కొంది. అయితే, బ్లూటూత్ కాలింగ్, ఎక్కువ బ్రైట్‍నెస్‍తో వాడితే బ్యాటరీ లైఫ్ తక్కువ రావొచ్చు.

ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 స్మార్ట్‌వాచ్ ధర, సేల్

Ambrane Wise Roam 2 Price: ఆంబ్రేన్ వైస్ రోమ్ 2 స్మార్ట్‌వాచ్ ధర ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో రూ.1,999గా ఉంది. ఆంబ్రేన్ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ ధర ప్రస్తుతం రూ.1,499గా ఉంది. బ్లాక్, గ్రే, గ్రీన్, బ్లూ, క్రీమ్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.