Gold ETF investment : ‘గోల్డ్ ఈటీఎఫ్’.. బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ది బెస్ట్ ఆప్షన్!
18 June 2023, 10:36 IST
- How to select gold ETF : మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మరి మీకు గోల్డ్ ఈటీఎఫ్ గురించి తెలుసా? తెలుసుకుంటే.. ఇక వదిలిపెట్టరు! గోల్డ్ ఈటీఎఫ్ ప్రయోజనాలతో పాటు మంచి ఆప్షన్‌ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాము..
‘గోల్డ్ ఈటీఎఫ్’.. బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ది బెస్ట్ ఆప్షన్!
How to select gold ETF : బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు! గోల్డ్ అనేది దీర్ఘకాలానికి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే మార్కెట్లో ఉన్న గోల్డ్‌ను కొనుగోలు చేసి, ఇన్వెస్ట్మెంట్ అంటే మాత్రం తప్పు చేస్తున్నట్టే! ఇలా చేస్తే సరైన ఫలితాలు ఉండవు. అలా అని బంగారంలో ఇన్వెస్ట్ చేయకపోవడం కూడా తప్పే! అందుకే.. 'గోల్డ్ ఈటీఎఫ్' ది బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ గోల్డ్ ఈటీఎఫ్? దీనితో వచ్చే ప్రయోజనాలేంటి? ఒక మంచి గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎంపిక చేసుకోవడం ఎలా? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి..?
గోల్డ్ ఈటీఎఫ్ గురించి తెలుసుకునే ముందు.. ఈటీఎఫ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈటీఎఫ్ అంటే.. 'ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్'. ఇది మ్యూచువల్ ఫండ్స్ సిస్టెమ్‌ను పోలి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా స్టాక్స్‌ను ఒక్క చోటకు తీసుకొస్తారు. వాటిని యూనిట్లుగా విక్రయిస్తుంటారు. ఈటీఎఫ్‌లు కూడా అంతే! కానీ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌కు ఒక ప్రధాన వ్యత్యాసం ఉంది. అందేంటంటే.. మ్యూచువల్ ఫండ్స్ కోసం ఫండ్ హౌజ్‌లలో ఇన్వెస్ట్ చేయాలి. కానీ ఈటీఎఫ్‌లలో మనం, మన సొంతంగా డిమ్యాట్ అకౌంట్లో వాటిని కొనుగోలు చేయవచ్చు, విక్రయించ్చు. అంటే.. సాధారణ స్టాక్స్‌ను ఎలా కొని, విక్రయిస్తామో.. ఈటీఎఫ్‌లు కూడా అంతే.
ఇక గోల్డ్ ఈటీఎఫ్‌తో వచ్చే యూనిట్లు.. హై ప్యూరిటీతో కూడిన ఫిజికల్ గోల్డ్‌తో సమానం. దీర్ఘకాలంలో పెట్టుబడులు చేస్తూ, వాటిని విక్రయించిన తర్వాత డబ్బులను పొందవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌తో ప్రయోజనాలివే..
What is Gold ETF : సాధారణంగా.. జ్యువెలరీ షాప్‌కు వెళ్లి గోల్డ్ కొంటే.. తరుగు, మేకింగ్ ఛార్జీలు వంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లో అలాంటి బాధలు ఉందవు!
బయట ఉండే వాట్, సేల్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ వంటివి గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఉండవు.
ఈ గోల్డ్ ఈటీఎఫ్‌ను 'హెడ్జింగ్' కోసం కూడా వాడుకొవచ్చు. సాధారణంగా అనిశ్చితి సమయాల్లో స్టాక్ మార్కెట్లు పడుతుంటాయి. అదే సమయంలో గోల్డ్ పెరుగుతుండటాన్ని గమనించే ఉంటాము. ఫలితంగా.. గోల్డ్ ఈటీఎఫ్‌తో మన ఇన్వెస్ట్‌మెంట్‌ను డైవర్సిఫైడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఈటీఎఫ్‌లపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడుతుందని గుర్తుపెట్టుకోవాలి.
ఇదీ చూడండి:- బంగారంలో ఇన్వెస్ట్ చేయాలా? టాప్ 5 గోల్డ్ ఈటీఫ్లు ఇవే..!
మంచి గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలి?
సాధారణంగా ఒక స్టాక్‌ని ఎంచుకునేడప్పుడు ఫండమెంటల్ ఎనాలసిస్ చేస్తాము. ఒక మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకునే ముందు.. దాని రిటర్నులు, ఫండ్ మేనేజర్, టైప్, ఎక్స్పెన్స్ రేషియో వంటివి చూస్తాము. అదే విధంగా.. గోల్డ్ ఈటీఎఫ్‌ను ఎంచుకునే ముందు కొన్ని ఫ్యాక్టర్స్‌ని పరిగణలోకి తీసుకోవాలి. అవేంటంటే..
ట్రేడింగ్ వాల్యూమ్..
Best Gold ETF's in India : వాల్యూమ్ అనేది ఈటీఎఫ్‌లలో చాలా కీలకమైన విషయం. వాల్యూమ్‌లు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది! వాల్యూమ్‌లు ఎక్కువ ఉంటే లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. కొనాలన్నా, అమ్మాలన్నా సులభంగా ఉంటుంది. లిక్విడిటీ లేని ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టినా, సరైన బయ్యర్ లేకపోతే అమ్మేడప్పుడు కాస్త కష్టపడాల్సి వస్తుంది.
ట్రాకింగ్ ఎర్రర్..
ఈటీఎఫ్‌లలో ట్రాకింగ్ ఎర్రర్ అన్న పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. మార్కెట్లో బంగారం ధర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. నిర్దిష్ట సమయానికి బయట మార్కెట్లో ఉన్న రేటు, గోల్డ్ ఈటీఎఫ్‌లోని ఎన్ఏవీ (నెట్ అసెట్ వాల్యూ) రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు. దీనినే ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. ప్రతి ఈటీఎఫ్‌కు ఇది కచ్చితంగా ఉంటుంది. అయితే.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎంచుకోవడంతో లాభాలు మెరుగుపడతాయి.
ఎక్స్పెన్స్ రేషియో..
Gold ETF returns : అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వసూలు చేసేదే ఈ ఎక్స్పెన్స్ రేషియో. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఉంటుంది. కాకాపోతే.. మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ఈటీఎఫ్‌లలో ఇది తక్కువగా ఉంటుంది.
చివరిగా.. డిమ్యాట్ అకౌంట్లో గోల్డ్ ఈటీఎఫ్ అని టైప్ చేస్తే చాలా ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో గోల్డ్‌బీస్ అని ఒకటి ఉంటుంది. గతంలో నిప్పాన్ సంస్థకు చెందిన గోల్డ్ ఈటీఎఫ్‌ను ఇప్పుడు గోల్డ్‌బీస్ అని పిలుస్తున్నారు. ఇదొక బెంచ్‌మార్క్‌లాగా పరిగణిస్తారు.