2023 Investment tips : 2023లో ‘ఇన్వెస్ట్మెంట్’ టిప్స్.. మీకోసం!
30 December 2022, 11:58 IST
Investment tips for 2023 : ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కోసం చూస్తున్నారా? 2023 నుంచి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
2023లో ‘ఇన్వెస్ట్మెంట్’ టిప్స్.. మీకోసం!
Tips to invest for New Year 2023 : ఈ న్యూయర్ రిసొల్యుషన్గా.. ఇన్వెస్ట్‌మెంట్‌ను మొదలుపెట్టాలని అనుకుంటున్నారా? ఎందులో పెట్టుబడులు పెట్టాలో మీకు అర్థం కావడం లేదా? అయితే ఈ కథనం మీకోసమే. ముందుగా.. ఇన్వెస్ట్మెంట్ కోసం ఉన్న ఆప్షన్స్‌ను తెలుసుకుందాము.
స్టాక్స్..
Stock Market investment tips : మంచి రిటర్నులు రాబట్టాలంటే.. అదే తరహా రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో.. స్టాక్స్ అనేవి ది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.
"వృద్ధి చెందుతున్న కంపెనీల్లో పెట్టుబడి పెట్టి, మంచి లాభాలు సంపాదించేందుకు స్టాక్స్ ఉపయోగపడుతాయి. కానీ ఇదొక హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. స్టాక్ మార్కెట్‌ను అర్థం చేసుకోలేకపోతున్న వారు.. స్టాక్స్ నుంచి దూరంగా ఉండటం మేలు," అని ట్రేడింగ్ మాస్టర్ సీఈఓ- ఫౌండర్ వినోద్ ధామా అన్నారు.
"కంపెనీల్లో పెట్టుబడి పెట్టి భారీగా రిటర్నులు సంపాదించాలనుకునే వారికి స్టాక్స్ అనేవి మంచి ఛాయిస్ అవుతాయి. వృద్ధి దశలో ఉన్న కంపెనీల్లో డైరక్ట్‌గా పెట్టుబడులు పెట్టేందుకు ఇవి ఉపయోగపడతాయి," అని క్లియర్ సీఈఓ- ఫౌండర్ అర్చిత్ గుప్త తెలిపారు.
మ్యూచువల్ ఫండ్స్..
Mutual funds investment tips : స్టాక్స్ కన్నా ఇంకా సులభమైన ఆప్షన్ ఈ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్ అంటా చాలా నేర్చుకోవాలి. మార్కెట్‌ను ప్రభావితం చేసే చాలా అంశాలను ట్రాక్ చేస్తూ ఉండాలి. ఫండమెంటల్ ఎనాలసిస్ను పూర్తిగా చేయాలి. ఇవేవీ వద్దనుకుంటే.. మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమమైన ఆప్షన్. పైగా.. స్టాక్ మార్కెట్‌తో పోల్చుకుంటే ఇందులో రిస్క్ కాస్త తక్కువగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌ని కూడా దీర్ఘకాలం గోల్స్‌తోనే చూడాలి. అప్పుడే మంచి రిటర్నులు లభిస్తాయి.
"మీ గోల్స్ తగ్గట్టు మంచి మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకోవాలి. ఇందుకు.. మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్, కమోడిటీస్ వంటివి కూడా మంచి ఆప్షన్‌గానే ఉన్నాయి," అని వినోద్ ధామా స్పష్టం చేశారు.
మ్యూచువల్ ఫండ్ సిప్ గురించి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ట్యాక్స్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో.. ఈ ఈఎల్ఎస్ఎస్ ఆప్షన్ మరింత ప్రత్యేకం! ఇందులో మంచి రిటర్నులతో పాటు ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ కూడా లభిస్తాయి. దీర్ఘకాలానికి ఇవి ఉపయోగపడతాయి.
గోల్డ్..
Gold investment returns : గోల్డ్ అనేది లాంగ్‌టర్మ్ కోసం ఎప్పటికైనా మంచి ఆప్షనే. పైగా.. ఇప్పుడు బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి.
"బంగారానికి ఈ మధ్య విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఫలితంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. 2023లో ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. రూ. 52,000- రూ. 53,000 అనేది ఇన్వెస్ట్‌మెంట్‌కు మంచి లెవల్‌గా ఉంది. ఫలితంగా 10-15శాతం రిటర్నులు ఆశించవచ్చు," అని అవంత ఇండియా ఎండీ నకుల్ మాథుర్ వెల్లడించారు.
రియల్ ఎస్టేట్..
Real Estate investment tips : "రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడు, ఎలా పెట్టుబడులు పెట్టాలి? అన్న విషయం మీకు పూర్తిగా అర్థమైతే.. ఈ సెగ్మెంట్లో భారీగా రిటర్నులు పొందవచ్చు. ఒడిదొడుకులు తగ్గితే.. మంచి రిటర్నులు లభిస్తాయి. కానీ ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మాలి? అన్న విషయంపైనే మీ రిటర్నులు ఆధారపడి ఉంటాయి," అని గంగానగర్ కమోడిటీ లిమిటెడ్ రీసెర్చ్ కమొడిటీస్ ఏవీపీ అమిత్ ఖారే తెలిపారు.
ఫిక్స్డ్ డిపాజిట్లు..
Highest FD interest rates 2022 : పైన చెప్పినవన్నీ కాస్త రిస్క్‌తో కూడుకున్నవి. రిస్క్ వద్దనుకునే వారికి సైతం కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా 50ఏళ్లు పైబడిన వారు.. రిస్క్ తీసుకోవడం ఉత్తమం కాదు. అందుకే వారికి ఈ అప్షన్స్ బాగా పనిచేస్తాయి. అవేంటంటే.. ఫిక్స్డ్ డిపాజిట్స్(ఎఫ్డీ), నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్(ఎన్ఎస్సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్).
పీపీఎఫ్‌లో 7-8శాతం వడ్డీ లభిస్తుంది. దీనిని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వడ్డీ రేట్ల పెంపుతో ఎఫ్డీలపై వడ్డీలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా వీటిల్లోకి నిధుల ప్రవాహం అధికమవుతోంది.
ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేయండి..
Investment tips for 2023 : 'ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పెట్టుబడులు చేయలేకపోతున్నాము,' అని చాలా మంది చెబుతూ ఉంటారు. వాస్తవానికి భారీ మొత్తంలో పెట్టుబడులు చేయాల్సిన అవసరం. రూ .500తో కూడా పెట్టుబడులను మొదలుపెట్టొచ్చు. ముందుగా మీకు వచ్చే జీతాన్ని, మీ ఖర్చులను రాసుకోవాలి. కొంతైనా మిగుల్చుకుని పెట్టుబడులు చేస్తూ ఉండాలి. చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమొస్తుంది? అని అనుకుంటే.. పొరపాటు చేసినట్టే. కాంపౌండింగ్ కాన్సెప్ట్‌తో దీర్ఘకాలంలో మంచి రిటర్నులు సంపాదించుకోవచ్చు.