Gold Rate Today: బంగారం భగభగ.. మళ్లీ రూ.50వేలపైకి.. వెండి అక్కడే..-gold price today 22k gold rate cross 50 thousand rupees mark again silver settles stable check latest prices ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rate Today: బంగారం భగభగ.. మళ్లీ రూ.50వేలపైకి.. వెండి అక్కడే..

Gold Rate Today: బంగారం భగభగ.. మళ్లీ రూ.50వేలపైకి.. వెండి అక్కడే..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 29, 2022 06:17 AM IST

Gold, Silver Rates Today: బంగారం ధర మరోసారి ఎగబాకింది. వెండి మాత్రం స్థిరంగా కొనసాగింది. నేటి ధరలు ఇవే..

Gold Rate Today : బంగారం, వెండి నేటు ధరలు ఇవే
Gold Rate Today : బంగారం, వెండి నేటు ధరలు ఇవే (REUTERS)

Gold Rate Today: బంగారం ధర మళ్లీ పెరిగింది. దీంతో దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) పసిడి రేటు మరోసారి రూ.50వేల ఎగువకు చేరింది. కిందటి రోజు స్థిరంగా ఉన్న పసిడి ధర నేడు (డిసెంబర్ 29) ఎగబాకింది. 22 గ్రాములకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.200 పెరిగి రూ.50,150కు చేరింది. 100 గ్రాములు రూ.5,01,500గా ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.230 పెరిగి రూ.54,710కు చేరింది. మరోవైపు వెండి మాత్రం స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో..

Gold Rate Today in Hyderabad: హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో బంగారం ధర నేడు పెరిగింది. భాగ్యనగరంలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.50,150గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి వెల రూ.54,710కు ఎగబాకింది. విశాఖపట్నం, విజయవాడ, అనంతపురంలోనూ ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

దేశంలోని ఇతర సిటీల్లో..

Gold Price in India: దేశంలోని ఇతర నగరాల్లోనూ బంగారం ధర పరుగులు పెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.50,300కు చేరింది. 24 గ్రాముల తులం బంగారం రూ.54,860కు పెరిగింది. బెంగళూరులో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేట్ రూ.50,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,760కు ఎగబాకింది. అహ్మదాబాద్, మైసూరులోనూ ఇవే ధరలు ఉన్నాయి.

ముంబైలోనూ బంగారం ధర అధికమైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.50,150కు చేరింది. 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.54,710గా ఉంది. కోల్‍కతా, కేరళలోనూ ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.55,690గా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ గోల్డ్ నేడు కాస్త తగ్గింది. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర సుమారు 6 డాలర్లు దిగి వచ్చి 1,805 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వివిధ అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరల్లో మార్పులు జరుగుతున్నాయి. డాలర్ విలువలో ఒడిదొడుకులు, ద్రవ్యోల్బణంతో పాటు చమురు ధరలు కూడా పసిడిపై ప్రభావాన్ని చూపుతున్నాయి.

వెండి స్థిరంగా..

Silver Price Today: కిందటి రోజున ఒక్కసారిగా ఎగబాకిన వెండి నేడు కాస్త శాంతించింది. స్థిరంగా ఉంది. దేశంలో కిలో వెండి ధర నేడు రూ.72,300 వద్ద కొనసాగింది. 100 గ్రాముల వెల రూ.7,230గా ఉంది.

హైదరాబాద్‍లో కిలో వెండి వెల రూ. 74,600గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ఇదే ధర కొనసాగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో సిల్వర్ రేటు రూ.72,300గా ఉంది. కోల్‍కతా, ముంబై, అహ్మదాబాద్, లక్నోలోనూ ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోలేదు.)

Whats_app_banner