తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Hyundai Verna Highlights : అదిరిపోయేలా 2023 హ్యుండాయ్ వెర్నా: ధరతో పాటు తెలుసుకోవాల్సిన 5 హైలైట్స్ ఇవే

New Hyundai Verna Highlights : అదిరిపోయేలా 2023 హ్యుండాయ్ వెర్నా: ధరతో పాటు తెలుసుకోవాల్సిన 5 హైలైట్స్ ఇవే

22 March 2023, 7:38 IST

  • 2023 Hyundai Verna: హ్యుండాయ్ వెర్నా ఆరో జనరేషన్ కారు వచ్చేసింది. అప్‍డేటెడ్ డిజైన్, సరికొత్త ఫీచర్లతో అడుగుపెట్టింది. ఈ 2023 హ్యుండాయ్ వెర్నా హైలైట్స్ ఇవే.

New Hyundai Verna Highlights : అదిరిపోయేలా 2023 హ్యుండాయ్ వెర్నా (Photo: Hyundai)
New Hyundai Verna Highlights : అదిరిపోయేలా 2023 హ్యుండాయ్ వెర్నా (Photo: Hyundai)

New Hyundai Verna Highlights : అదిరిపోయేలా 2023 హ్యుండాయ్ వెర్నా (Photo: Hyundai)

2023 Hyundai Verna: 2023 హ్యుండాయ్ వెర్నా కారు భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. ప్రస్తుత వెర్నా కంటే ఈ కొత్త తరం 2023 వెర్నా భారీ డిజైన్ అప్‍గ్రేడ్లు, సరికొత్త ఫీచర్లతో విడుదలైంది. హ్యుందాయ్ వెర్నాకు ఆరో జనరేషన్‍గా ఈ 2023 మోడల్ లాంచ్ అయింది. ఈ అప్‍డేటెడ్ సెడాన్ కారు హైలైట్స్ ఇవే.

సరికొత్త డిజైన్‍తో..

2023 Hyundai Verna: ప్రస్తుత జనరేషన్‍తో పోలిస్తే 2023 హ్యుండాయ్ వెర్నా చాలా డిజైన్ అప్‍గ్రేడ్‍లతో వచ్చింది. మఖ్యంగా సెడాన్ విభాగంలో చాలా స్టైలిష్ లుక్‍ను కలిగి ఉంది. రీడిజైన్ అయిన ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్‍లు ఉండగా.. వీటిపైన సన్నని ఎల్ఈడీ స్ట్రిప్ ఉంది. పారమెట్రిక్ ఫ్రంట్ గ్రిల్ చాలా కొత్త డిజైన్‍తో ఉంది. ప్రస్తుత మోడల్ కంటే గ్రిల్ పెద్దగా ఉంది. వెనుక టెయిల్ ల్యాంప్‍లను కలుపుతూ ఓ ఎల్ఈడీ స్ట్రిప్ ఉంది. చూడడానికి ఈ నయా వెర్నా చాలా స్పోర్టీ లుక్‍ను ఇస్తోంది.

2023 హ్యుండాయ్ వెర్నా ఇంజిన్, పర్ఫార్మెన్స్

2023 Hyundai Verna: 1.5-లీటర్ నాచురలీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్, 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో 2023 హ్యుండాయ్ వెర్నా వచ్చింది. టర్బో ఇంజిన్ 157 bhp పవర్, 250 Nm టార్క్యూను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ పెట్రోల్ NA ఇంజిన్ 115 hp, 144 Nm టార్క్యూను ప్రొడ్యూజ్ చేస్తుంది. ఐవీటీ వేరియంట్లకు సిక్స్-స్పీడ్ మాన్యువల్ యూనిట్ ఉంటుంది. సెవెన్ స్పీడ్ డీసీటీ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.

2023 హ్యుండాయ్ వెర్నా ఫీచర్లు

2023 Hyundai Verna: ఇన్ఫోటైన్‍మెంట్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కోసం 2023 హ్యుండాయ్ వెర్నా క్యాబిన్‍లో భారీ పనరామిక్ డిస్‍ప్లే ఉంటుంది. 10.25 ఇంచుల ఇన్ఫోటైన్‍మెంట్ టచ్‍స్క్రీన్ ఉంది. వెంటిలేటెడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‍తో ఈ కారు వస్తోంది. 64 లైట్ యాంబియెంట్ లైటింగ్, వైర్లెస్ ఫోన్ చార్జింగ్, లెదర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, పవర్ డ్రైవర్ సీట్, లెదర్ సీట్లను ఈ 2023 హ్యుందాయ్ వెర్నా కలిగి ఉంది.

సరికొత్త సెఫ్టీ ఫీచర్లు

2023 Hyundai Verna: ఆరు ఎయిర్ బ్యాగ్‍లు, ఏబీఎస్, ఈబీడీ ఫీచర్లు అన్ని 2023 హ్యుండాయ్ వెర్నా వేరియంట్లలో ఉంటాయి. టాప్ ఎండ్ వేరియంట్లకు నాలుగు డిస్క్ బ్రేక్‍లు ఉంటాయి. 2023 హ్యుండాయ్ వెర్నాలో కొన్ని వేరియంట్లు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‍ (ADAS)తో వస్తున్నాయి. ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, అవాయిడెన్స్ అసిస్ట్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్ వార్నింగ్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ సహా మరిన్ని సేఫ్రీ ఫీచర్లు ఈ ADAS ద్వారా ఉంటాయి.

2023 హ్యుండాయ్ వెర్నా వేరియంట్లు, ధర, కలర్స్

2023 Hyundai Verna Variants: 2023 హ్యుండాయ్ వెర్నా నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. ఈఎక్స్ (EX), ఎస్ (S), ఎస్ఎక్స్ (SX), ఎస్ఎక్స్ (ఓ) (SX(O)) వేరియంట్లు వచ్చాయి. టైఫూన్ సిల్వర్, ఫైరీ రెడ్, టైటాన్ గ్రే, స్టారీ నైట్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్లిరియాన్ బ్రౌన్ కలర్ ఆప్షన్‍లలో హ్యుండాయ్ 2023 వెర్నాఅందుబాటులోకి వచ్చింది.

2023 Hyundai Verna Price: 2023 హ్యుండాయ్ వెర్నా నాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‍తో ఆరు వేరియంట్ ఆప్షన్లు, టర్బో ఇంజిన్ లైనప్‍లో నాలుగు మోడళ్లు లాంచ్ అయ్యాయి. వీటి ధరలు రూ.10.89లక్షల నుంచి రూ.17.37లక్షల మధ్య ఉన్నాయి. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలుగా ఉన్నాయి. ఇప్పటికే 2023 హ్యుండాయ్ వెర్నా బుకింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే బుకింగ్‍లు 8,000 మార్కును దాటాయని హ్యుండాయ్ పేర్కొంది.