తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Verna 2023: భారీ డిజైన్ మార్పులతో రానున్న 2023 హ్యుండాయ్ వెర్నా.. స్పోర్టీ లుక్‍తో..

Hyundai Verna 2023: భారీ డిజైన్ మార్పులతో రానున్న 2023 హ్యుండాయ్ వెర్నా.. స్పోర్టీ లుక్‍తో..

21 February 2023, 11:23 IST

    • Hyundai Verna 2023: హ్యుందాయ్ వెర్నా 2023 వెర్షన్ మరింత స్పోర్టీ లుక్‍తో అడుగుపెట్టనుంది. ఈ నయా మోడల్‍కు సంబంధించిన స్కెచ్‍లను హ్యుండాయ్ విడుదల చేయటంతో డిజైన్‍కు సంబంధించిన వివరాలు తెలిశాయి.
Hyundai Verna 2023: భారీ డిజైన్ మార్పులతో రానున్న 2023 హ్యుండాయ్ వెర్నా (Photo: Hyundai Motors)
Hyundai Verna 2023: భారీ డిజైన్ మార్పులతో రానున్న 2023 హ్యుండాయ్ వెర్నా (Photo: Hyundai Motors)

Hyundai Verna 2023: భారీ డిజైన్ మార్పులతో రానున్న 2023 హ్యుండాయ్ వెర్నా (Photo: Hyundai Motors)

Hyundai Verna 2023: హ్యుండాయ్ వెర్నా తదుపరి జనరేషన్‍ (Hyundai Verna Next Gen)ను లాంచ్ చేసేందుకు హ్యుండాయ్ మోటార్స్ (Hyundai Motors) సిద్ధమైంది. 2023 హ్యుండాయ్ వెర్నా (2023 Hyundai Verna) సెడాన్ కారు మార్చి 21న భారత మార్కెట్‍లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. వెర్నాకు ఇది ఆరో జనరేషన్‍గా ఉండనుంది. కాగా, 2023 హ్యుండాయ్ వెర్నా డిజైన్ (2023 Hyundai Verna Design) రెండర్లను హ్యుందాయ్ మోటార్స్ తాజాగా విడుదల చేసింది. స్కెచ్చెస్‍ను వెల్లడించింది. దీంతో హ్యుండాయ్ వెర్నా 2023 మోడల్ ఎక్స్‌టీరియర్ డిజైన్ ఎలా ఉండనుందో తెలిసిపోయింది. ప్రస్తుత మోడల్ కంటే ఈ నయా జనరేషన్ వెర్నా చాలా మార్పులతో రానుంది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

మార్పులు ఇవే..

Hyundai Verna 2023: ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే.. హ్యుండాయ్ వెర్నా 2023 కారుకు పూర్తి రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్ ఉండనుంది. మరింత స్పోర్టీగా ఉండేలా దీన్ని హ్యుండాయ్ రూపొందించింది. అలాగే ఫ్రంట్‍లో సన్నని ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుంది. వెనుక ఎల్-షేప్డ్ ఎల్ఈడీ టైల్‍లైట్స్ ఉంటాయి. బంపర్‌ డిజైన్‍లో మార్పు ఉంటుంది.

Hyundai Verna 2023: సైడ్‍లోనూ స్పోర్టీ లుక్ ఉండేలా 2023 వెర్నాను హ్యుండాయ్ తీర్చిదిద్దింది. షార్ప్ క్యారెక్టర్ లైన్స్ ఈ కారుకు మరింత ప్రీమియమ్ లుక్‍ను ఇవ్వనున్నాయి. అలాయ్ వీల్స్ కూడా మరింత స్పోర్టీగా ఉన్నాయి. మిడ్ సైజ్ సెడాన్ విభాగంలో డిజైన్ పరంగా ఈ వెర్నా 2023 మోడల్ ఆకట్టుకునేలా ఉండనుంది.

డ్యుయల్ స్క్రీన్ సెటప్

Hyundai Verna 2023: ఇంటీరియర్ విషయానికి వస్తే, ఓ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍తో కూడిన డ్యుయల్ స్క్రీన్ సెటప్‍తో వెర్నా 2023 మోడల్ రానుందని తెలుస్తోంది. ఇందులో మరొకటి డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్‌గా ఉంటుంది.

బుకింగ్స్ మొదలు, నాలుగు వేరియంట్లలో..

Hyundai Verna 2023: ఇప్పటికే 2023 హ్యుండాయ్ వెర్నా బుకింగ్స్ మొదలయ్యాయి. రూ.25వేల టోకెన్ అమోంట్ చెల్లించి హ్యుండాయ్ డీలర్‌షిప్‍ల వద్ద, అధికారిక వెబ్‍సైట్‍లోనూ బుక్ చేసుకోవచ్చు. ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (ఓ) వేరియంట్లలో 2023 హ్యుండాయ్ వెర్నా అందుబాటులోకి రానుంది. ఇక 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‍తో నయా వెర్నా వస్తుందని తెలుస్తోంది. మరో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ కూడా ఉండనుంది.

Hyundai Verna 2023 Price: 2023 హ్యుండాయ్ వెర్నా ధర రూ.9.99 లక్షల నుంచి రూ.17లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండొచ్చని అంచనా.