తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Cd110 Dream Deluxe : ఇదిగో 2023 హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​.. ధర ఎంతంటే!

Honda CD110 Dream Deluxe : ఇదిగో 2023 హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​.. ధర ఎంతంటే!

Paarth Khatri HT Telugu

12 August 2023, 9:29 IST

google News
    • 2023 Honda CD110 Dream Deluxe : హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​ 2023 వర్షెన్​ లాంచ్​ అయ్యింది. ధరతో పాటు ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఇదిగో 2023 హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​..
ఇదిగో 2023 హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​..

ఇదిగో 2023 హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​..

2023 Honda CD110 Dream Deluxe : హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా.. తాజాగా 2023 సీడీ110 డ్రీమ్​ డీలక్స్​ను ఇండియాలోకి తీసుకొచ్చింది​. ఇది కేవలం ఒక్క వేరియంట్​లోనే అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 73,400. అంతేకాకుండా.. ఈ బైక్​పై 10ఏళ్ల వారెంటీ ప్యాకేజ్​ (3ఏళ్లు స్టాండర్డ్​+ 7ఏళ్ల ఆప్షనల్​ ఎక్స్​టెండెడ్​ వారెంటీ)ను కూడా సంస్థ ఇస్తుండటం విశేషం.

కొత్త బైక్​లో హైలైట్స్​ ఇవే..

హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​ బైక్​లో 109.51 సీసీ, ఎయిర్​ కూల్డ్​ 4 స్ట్రోక్​, సింగిల్​ సిలిండర్, ఫ్యూయెల్​ ఇంజెక్టెడ్​​ ఇంజిన్​ ఉంటుంది. హోండా ఎన్​హాన్స్​డ్​ స్మార్ట్​ పవర్​ టెక్నాలజీ కూడా లభిస్తోంది. ఈ ఇంజిన్​.. 7500 ఆర్​పీఎం వద్ద 8.67 బీహెచ్​పీ పవర్​ను, 5,500 ఆర్​పీఎం వద్ద 9.30 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 4 స్పీడ్​ గేర్​బాక్స్​ దీని సొంతం. కిక్​ స్టార్ట్​తో పాటు సెల్ఫ్​ స్టార్ట్​ ఆప్షన్​ కూడా ఇందులో ఉంది.

ఇక ఈ బైక్​ ఫ్రెంట్- రేర్​ వీల్స్​కు 130ఎంఎం డ్రమ్​ బ్రేక్స్​ లభిస్తున్నాయి. 18 ఇంచ్​ అలాయ్​ వీల్స్​, ట్యూబ్​లెస్​ టైర్స్​ వస్తున్నాయి. ఫ్రెంట్​లో టెలిస్కోపిక్​ ఫోర్క్స్​, రేర్​లో హైడ్రాలిక్​ ట్విన్​ షాక్​ అబ్సార్బర్స్​ వంటి సస్పెన్షన్స్​ లభిస్తున్నాయి.

ఇదీ చూడండి:- Honda SP160: స్టన్నింగ్ డిజైన్ తో వచ్చిన హోండా ఎస్ పీ 160 బైక్ ను చూశారా?

ఈ హోండా సీడీ110 డ్రీమ్​ డీలక్స్​లో సైడ్​ స్టాండ్​ ఇంజిన్​ కటాఫ్​ ఫీచర్​ ఉంది. ఫలితంగా సైడ్​ స్టాండ్​ వేసి ఉంటే, ఇంజిన్​ స్టార్ట్​ అవ్వదు. ఆటో చోక్​ ఫంక్షన్​ కూడా అందుబాటులో ఉంది. ఇంజిన్​ స్టార్ట్​- స్టాప్​ స్విచ్​ కూడా లభిస్తోంది. ఇందులోని సింగిల్​ పీస సీట్​ ఎత్తు 720ఎంఎం.

Honda CD110 Dream Deluxe price : ఈ హోండా కొత్త బైక్​తో కంఫర్ట్​, కన్వీనియెన్స్​, రిలయబులిటీ లభిస్తుంది సంస్థ ఎండీ సుట్సుము ఒటాని తెలిపారు. మార్కెట్​లో దీనికి మంచి డిమాండ్​ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ బైక్​.. హెచ్​ఎఫ్​ డీలక్స్​, టీవీఎస్​ రేడియన్​, బజాజ్​ సీటీ110, టీవీఎస్​ స్పోర్ట్​ వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

మరో కొత్త బైక్​ కూడా వస్తోందా..?

Honda new bike : సరికొత్త బైక్​ను ఇండియాలో లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా మోటార్​సైకిల్​ అండ్​ స్కూటర్​ ఇండియా. ఈ మోడల్​పై ప్రస్తుతం పెద్దగా సమాచారం లేదు. అయితే.. ఇది 160సీసీ- 180సీసీ సెగ్మెంట్​ మధ్యలో ఉంటుందని ఊహాగానాలు సాగుతున్నాయి. 'ప్లే ఇట్​ బోల్డ్​' అన్న క్యాప్షన్​తో.. లాంచ్​ ఈవెంట్​కు మీడియాకు ఆహ్వానం పంపించింది హోండా సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం