తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bmw M 1000 Rr Bike: భారత్ లోకి బీఎండబ్ల్యూ బైక్ గ్రాండ్ ఎంట్రీ.. ఈ బైక్ సీసీ ఎంతో తెలుసా?

BMW M 1000 RR bike: భారత్ లోకి బీఎండబ్ల్యూ బైక్ గ్రాండ్ ఎంట్రీ.. ఈ బైక్ సీసీ ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

29 June 2023, 13:36 IST

google News
    • BMW M 1000 RR bike: బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ బైక్ భారత్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇది ఇండియన్ మార్కెట్లో డ్యుకాటీ పానిగేల్ వీ4 ఆర్ తో పోటీ పడనుంది.
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ బైక్
బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ బైక్

బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ బైక్

BMW M 1000 RR bike: బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ బైక్ భారత్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఇది ఇండియన్ మార్కెట్లో డ్యుకాటీ పానిగేల్ వీ4 ఆర్ తో పోటీ పడనుంది. బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ బైక్ భారత్ లోకి కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ (CBU) గా వస్తోంది. ఈ బైక్ ప్రి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బైక్ డెలివరీ నవంబర్ 2023 లో ప్రారంభమవుతుంది.

999 సీసీ ఇంజిన్..

ఈ బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ బైక్ లో 999 సీసీ, వాటర్ లేదా ఆయిల్ కూల్డ్ 4 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో బీఎండబ్ల్యూ షిఫ్ట్ కామ్ టెక్నాలజీ ఉంటుది. ఈ బైక్ 14,500 ఆర్పీఎం వద్ద 210 బీహెచ్పీ మాక్సిమమ్ పవర్ ను, అలాగే, 11000 ఆర్పీఎం వద్ద 113 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ సెటప్ ఉంది. బ్లాక్ స్టార్మ్ మెటాలిక్, ఎం మోటార్ స్పోర్ట్ కలర్ స్కీమ్స్ లో ఇది లభిస్తుంది. ఈ బైక్ లో ఎం జీపీఎస్ లాప్ ట్రిగ్గర్, పాసెంజర్ కిట్, ఎం బిలెట్ ప్యాక్ ఉంటాయి.

స్పెషల్ ఫీచర్స్, ధర

ఈ బైక్ లో డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ ప్రొ, డైనమిక్ బ్రేక్ లైట్ తదితర అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే, కలర్డ్ టీఎఫ్టీ స్క్రీన్, ఎల్ఈడీ లైటింగ్, యూఎస్బీ పోర్ట్ మొదలైన ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతేకాదు, ఆన్ బోర్డ్ కంప్యూటర్, క్రూయిజ్ కంట్రోల్, డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ వేరియంట్, కాంపిటీషన్ వేరియంట్. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధరను రూ. 49 లక్షలుగా, కాంపిటీషన్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధరను రూ. 55 లక్షలుగా నిర్ణయించారు.

టాపిక్

తదుపరి వ్యాసం