తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Bike : 300కి.మీ రేంజ్​తో ఓలా నుంచి పవర్​ఫుల్​ ఎలక్ట్రిక్​ బైక్​!

Ola electric bike : 300కి.మీ రేంజ్​తో ఓలా నుంచి పవర్​ఫుల్​ ఎలక్ట్రిక్​ బైక్​!

Sharath Chitturi HT Telugu

15 July 2023, 11:03 IST

google News
    • Ola electric bike : సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ను ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇది వచ్చే నెలలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.
వచ్చే నెలలో ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ లాంచ్​..!
వచ్చే నెలలో ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ లాంచ్​..!

వచ్చే నెలలో ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ లాంచ్​..!

Ola electric bike : ఓలా ఎలక్ట్రిక్​ పోర్ట్​ఫోలియోకు క్రేజీ డిమాండ్​ కనిపిస్తోందన్న విషయం తెలిసిందే. ఎస్​1 రేంజ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్లు బంపర్​ హిట్​ కొట్టాయి. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్​ బైక్స్​పై సంస్థ ఫోకస్​ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ కొత్త మోడల్..​ ఆగస్టు 15న లాంచ్​ అవుతుందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎలక్ట్రిక్​ బైక్​ హిట్​ అవుతుందా..?

ఇండియాలో ఈవీలకు డిమాండ్​ గణనీయంగా పెరుగుతోంది. కార్లతో పాటు స్కూటర్లు, బైక్స్​కి కూడా ఈవీ టచ్​ ఇచ్చేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ పోటీని మరింత రసవత్తరం చేసేందుకు ఓల ఎలక్ట్రిక్​ కూడా ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బైక్ లాంచ్​పైనే కాకుండా.. దాని​ రేంజ్​పైనా సంస్థ అధిక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వార్తలు నిజమైతే.. ఈ ఎలక్ట్రిక్​ బైక్​ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 300-315 కి.మీల దూరం ప్రయాణిస్తుంది! కచ్చితంగా ఇది భారతీయులను ఆకర్షించే విషయమే. ఈ రేంజ్​ను సాధించాలంటే.. కొత్తగా వస్తున్న వెహికిల్​లో 8కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉండొచ్చని సమాచారం. ఓలా ఎస్​1 ప్రో ఎలక్ట్రిక్​ స్కూటర్​లో ప్రస్తుతం ఉన్న బ్యాటరీ (3.97కేడబ్ల్యూహెచ్​) కన్నా ఇది రెండింతలు పెద్దది!

ఇదీ చూడండి:- Royal Enfield Scram 440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440కి ధీటుగా రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​!

అంతేకాకుండా.. కొత్త బైక్​లో ఇంజిన్​ పవర్​ఫుల్​గా ఉండొచ్చు. 150సీసీ- 180సీసీ సెగ్మెంట్​ను ఓలా సంస్థ టార్గెట్​గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇక లేటెస్ట్​ ఫీచర్స్​ని కూడా యాడ్​ చేయాలని సంస్థ చూస్తున్నట్టు సమాచారం.

ధర ఎంత ఉండొచ్చు..!

ఈ ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.25లక్షలుగా ఉండొచ్చని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. రూ. 2లక్షల రేంజ్​లో లాంచ్​ చేస్తే, మరింత అట్రాక్టివ్​గా మారుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బైక్​కి సంస్థ నుంచి ఫైనాన్స్​ సర్వీస్​ కూడా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

ఈ కొత్త బైక్​కి సంబంధించిన ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలు రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం