Royal Enfield Scram 440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440కి ధీటుగా రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​!-royal enfield scram 440 in works what can we expect see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Scram 440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440కి ధీటుగా రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​!

Royal Enfield Scram 440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440కి ధీటుగా రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​!

Sharath Chitturi HT Telugu
Jul 09, 2023 05:36 PM IST

Royal Enfield Scram 440 : కొత్త స్క్రామ్​ 440 బైక్​ను రాయల్​ ఎన్​ఫీల్డ్​ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. హార్లీ డేవిడ్​సన్​​ ఎక్స్​440, ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 400 ఎక్స్​ బైక్స్​కు పోటీగా ఈ మోడల్​ను తీసుకొస్తున్నట్టు సమాచారం.

హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440కి ధీటుగా రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​!
హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440కి ధీటుగా రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​! (Representative image)

Royal Enfield Scram 440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440, ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 400 ఎక్స్​ బైక్స్..​ గత కొన్ని రోజులుగా ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో హాట్​ టాపిక్​గా మారాయి. వీటితో రాయల్​ ఎన్​ఫీల్డ్​ బిజినెస్​కు ముప్పు పొంచి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటికి చెక్​ పెట్టేందుకు, సరికొత్త బైక్​ను రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బైక్​ పేరు 'రాయల్​ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్​ 440'. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ ఎలా ఉంటుందంటే..

స్క్రామ్​ 411 ను ఇప్పటికే మార్కెట్​లోకి తీసుకొచ్చింది రాయల్​ ఎన్​ఫీల్డ్​. ఇది హిమాలయన్​కు ప్రత్యామ్నాయంగా మారింది. ఇక ఇప్పుడు స్క్రామ్​ 440పై ఫోకస్​ చేసింది. దీని కోడ్​నేమ్​ డీ4కే అని తెలుస్తోంది. ఇందులో స్లోపింగ్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, వైడ్​ హ్యాండిల్​బార్​, సింగిల్​ పీస్​ సీట్​, అప్​స్వెప్ట్​ ఎగ్సాస్ట్​, రౌండ్​ హెడ్​లైట్​, స్లీక్​ టెయిల్​ల్యాంప్​, ఆల్​ ఎల్​ఈడీ లైటింగ్​ సెటప్​, రగ్డ్​ లుకింగ్​ వయర్​ స్పోక్డ్​ వీల్స్​ ఉండొచ్చు. సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వస్తుంది. ట్రిప్పర్​ నేవిగేషన్​ పాడ్​ను ఆప్షనల్​గా ఇవ్వొచ్చు.

ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్​ 440లో.. 440 సీసీ, ఎయిర్​- ఆయిల్​ కూల్డ్​, సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న 411 సీసీ ఇంజిన్​ ఆధారంగానే దీనిని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది 28-30 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేసే అవకశం ఉంది.

ఇక సేఫ్టీ కోసం ఈ స్టైలిష్​ బైక్​ ఫ్రెంట్​- రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​తో పాటు పలు ఆసక్తికర ఫీచర్స్​ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ సరికొత్త బైక్​ ధర ఎంత?

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ ఫీచర్స్​, ధరకు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులో లేవు. లాంచ్​ ఎప్పుడవుతుంది? అన్న విషయంపైనా క్లారిటీ లేదు. 2024లో లాంచ్​ అవుతుందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అయితే.. హార్లీ డేవిడ్​సన్​, ట్రయంఫ్​ బైక్స్​ను ఢీకొట్టాలంటే.. వాటి కన్నా తక్కువ లేదా దాదాపు సమానమైన ధరకే దీనిని కూడా సేల్​ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ స్క్రామ్​ 440 ఎక్స్​షోరూం ధర రూ. 2.06లక్షలు- రూ. 2.25లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్​లో అంచనాలు మొదలయ్యాయి.

Whats_app_banner