Royal Enfield vs Triumph: ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 వర్సెస్ ట్రయంఫ్ స్ట్రీట్ 400.. ఏది బెస్ట్?-royal enfield interceptor 650 vs triumph street 400 spec comparison ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Vs Triumph: ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 వర్సెస్ ట్రయంఫ్ స్ట్రీట్ 400.. ఏది బెస్ట్?

Royal Enfield vs Triumph: ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 వర్సెస్ ట్రయంఫ్ స్ట్రీట్ 400.. ఏది బెస్ట్?

HT Telugu Desk HT Telugu
Jul 01, 2023 07:14 PM IST

ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. ట్రయంఫ్ లైనప్ లో ఇదే చవకైన బైక్. భారత్ లో ఇంటర్ సెప్టర్ 650 తో ఇది పోటీ పడనుంది.

ట్రయంఫ్ స్పీడ్ 400, రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650
ట్రయంఫ్ స్పీడ్ 400, రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650

ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. ట్రయంఫ్ లైనప్ లో ఇదే చవకైన బైక్. భారత్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 తో ఇది పోటీ పడనుంది. ఈ రెండు బైక్స్ లో ఏది బెస్ట్ అనే విషయాన్ని వాటి ఫీచర్స్ ను పోలుస్తూ తెలుసుకుందాం..

Engine and gearbox: ఇంజన్, గేర్ బాక్స్

రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 లో 648 సీసీ ఎయిర్ - ఆయిల్ కూల్డ్ ట్విన్ యూనిట్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,250 ఆర్పీఎం వద్ద 47 బీహెచ్పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. మరోవైపు, ట్రయంఫ్ స్పీడ్ 400 లో 398.15 సీసీ ఫ్యుయెల్ ఇంజెక్టెడ్, లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,000 ఆర్పీఎం వద్ద 39.5 బీహెచ్పీ పవర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో కూడా స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ తో 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.

Hardware: హార్డ్ వేర్

రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 లో హ్యారిస్ పర్ఫార్మెన్స్ డిజైన్ చేసిన ట్యూబ్యులార్ డబుల్ క్రేడిల్ ఛాసిస్ ఉంటుంది. ముందు వైపు 41 ఎంఎం టెలీస్కోపిక్ ఫోర్క్స్, వెనుకవైపు ట్విన్ గ్యాస్ షాక్ అబ్సార్బర్స్ ఉంటాయి. ముందు 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక 240 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంటాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 లో సరికొత్త పెరిమీటర్ ఫ్రేమ్ తో పాటు ముందువైపు పిస్టన్ ఫోర్క్స్, గ్యాస్ ఛార్జ్డ్ మోనో షాక్ వెనుకవైపు ఉంటాయి. ముందువైపు 300 ఎంఎం డిస్క్ బ్రేక్ , వెనుక 230 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంటాయి. డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ఉంటుంది.

Features: ఫీచర్స్

ట్రయంఫ్ స్పీడ్ 400 లో పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 లో హెడ్ ల్యాంప్ మాత్రం ఎల్ఈడీ ఉంటుంది. ట్రయంఫ్ లో అనలాగ్ స్పీడో మీటర్ తో పాటు డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 లో అనలాగ్ డయల్స్ తో పాటు ఫ్యుయెల్ గాగ్ ను, ట్రిప్ మీటర్స్ ను చూపే చిన్న డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది.

Whats_app_banner