Tata Nexon EV: మరో రికార్డు సృష్టించిన టాటా నెక్సాన్ ఈవీ
Tata Nexon EV: టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు మరో రికార్డు సృష్టించింది. లాంచ్ అయిన నాటి నుంచి 50 వేల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ 2020 లో లాంచ్ చేసింది.
Tata Nexon EV: టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు (Tata Nexon EV) మరో రికార్డు సృష్టించింది. లాంచ్ అయిన నాటి నుంచి 50 వేల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ 2020 లో లాంచ్ చేసింది. 2020 నుంచి ఇప్పటివరకు, అంటే సుమారు మూడేళ్లలో మొత్తం 50 వేల టాటా నెక్సాన్ ఈవీ లు అమ్ముడుపోయాయి. టాటా నెక్సాన్ ఈవీ ప్రస్తుతం భారత్ లోని అత్యంత పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ (electric SUV).
రెండు వేరియంట్లలో..
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు.. ప్రైమ్ (Tata Nexon EV prime), మ్యాక్స్ (Tata Nexon EV max) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 14.49 లక్షల నుంచి, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 16.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. నెక్సాన్ ఈవీ భారత్ లో దాదాపు 500 నగరాలు, పట్టణాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. మంచి బ్యాటరీ బ్యాకప్ తో లాంచ్ అయిన నాటి నుంచి వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కారుపై ఒకేసారి 1500 కిమీలు వెళ్లిన వినియోగదారులు కూడా ఉన్నారని టాటా మెటార్స్ తెలిపింది. దేశంలో ప్రస్తుతం టాటా మోటార్స్ వారి 1500 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. టాటా మోటార్స్ కు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో మంచి సక్సెస్ ను ఇచ్చిన మోడల్ టాటా నెక్సాన్ ఈవీ. ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో ఇప్పటివరకు మార్కెట్ లీడర్ గా ఈ కారు ఉంది. ఈ ఎలక్ట్రిక కారుకు రెగ్యులర్ గా సాఫ్ట్ వేర్ అప్డేడ్స్ ను సంస్థ అందిస్తోంది.