Honda new bike : హోండా నుంచి సరికొత్త బైక్.. లాంచ్ ఎప్పుడంటే..!
Honda new bike : హోండా సంస్థ నుంచి ఓ కొత్త బైక్ ఇండియాలో లాంచ్కానుంది. ఆగస్ట్‌లో ఇది లాంచ్ అవుతుందని సమాచారం.
Honda new bike : సరికొత్త బైక్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). వచ్చే నెలలోనే ఈ లాంచ్ ఈవెంట్ ఉండనుంది. ఈ మోడల్‌పై ప్రస్తుతం పెద్దగా సమాచారం లేదు. అయితే.. ఇది 160సీసీ- 180సీసీ సెగ్మెంట్ మధ్యలో ఉంటుందని ఊహాగానాలు సాగుతున్నాయి. 'ప్లే ఇట్ బోల్డ్' అన్న క్యాప్షన్‌తో.. లాంచ్ ఈవెంట్‌కు మీడియాకు ఆహ్వానం పంపించింది హోండా సంస్థ.
కొత్త బైక్ ఎలా ఉంటుంది..?
ప్రస్తుతం హోండా 160-180 సీసీ సెగ్మెంట్లో యూనికార్న్ 160, హార్నెట్ 2.0 మోడల్స్ ఉన్నాయి. కొత్తది కూడా ఇందులోనే యాడ్ అయ్యే అవకాశం ఉంది. యూనికార్న్ 160 బైక్ హోండాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. కానీ హార్నెట్ 2.0 పెద్దగా క్లిక్ అవ్వలేదు.
ఇక ప్రీమియం సెగ్మెంట్ బైక్స్‌లో బజాజ్, హీరో, టీవీఎస్ మోడల్స్ దూసుకెళుతున్నాయి. రానున్న రోజుల్లో లాంచ్ అయ్యే హోండా బైక్.. వీటికి గట్టిపోటీనిచ్చే విధంగా ఉంటుందా? లేదా? అన్నది చూడాలి.
Honda new bike launch : ఇండియా మార్కెట్‌పై హోండా సంస్థ గట్టిగానే ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే షైన్ 100, డియో 125, యాక్టివ్, యాక్టివ్ 125, గ్రేషియా 125 వంటి మోడల్స్‌కు అప్డేటెడ్ వర్షెన్లను విడుదల చేసింది. ఈ మిగిలిన నెలల్లో ప్రీమియం సెగ్మెంట్లో మోడల్స్‌ను లాంచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా కస్టమర్లలో హోండాపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో హోండా కొత్త బైక్‌కు సంబంధించిన వివరాలు.. లాంచ్ టైమ్ దగ్గరపడే కొద్ది తెలిసే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా..!
Honda electric scooter : ఇండియా 2 వీలర్ సెగ్మెంట్లో మార్కెట్ షేరును పెంచుకునేందుకు విపరీతంగా కృషిచేస్తోంది హోండా. సీబీఆర్250ఆర్ఆర్, సీఎల్300లకు ఇటీవలే పేటెంట్ పొందిన ఈ ఆటోమొబైల్ కంపెనీ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లపైనా ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే కొత్తగా రెండు స్కూటర్లకు పేటెంట్లు ఫైల్ చేసింది.
హోండా ఇటీవలే పేటెంట్ పొందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల పేర్లు డాక్స్ ఈ, జూమర్ ఈ అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల వర్షెన్లు మాడెర్న్గా ఉంటాయని సమాచారం. సైజు పరంగా రెండు చిన్నవే! అయితే వీటిల్లో బాష్ హబ్ మోటార్ ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80కి.మీల రేంజ్ రావొచ్చు. 25కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ ఉండొచ్చు. హోండా డాక్స్ ఈ, జూమర్ ఈలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈసీ ఇన్స్ట్రుమెంట్ స్క్రీన్, ఫ్రెంట్- రేర్‌లో డిస్క్ బ్రేక్స్ వంటివి ఫీచర్స్‌గా ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం