Kawasaki bikes : రెండు అడ్వెంచర్ బైక్స్‌ను లాంచ్ చేసిన కవాసకి.. హైలైట్స్ ఇవే!
Kawasaki bikes launch : ఇండియాలో రెండు అడ్వెంచర్ బైక్స్‌ను లాంచ్ చేసింది కవాసకి. వాటి ధరలు ఇక్కడ తెలుసుకుందాము..
Kawasaki KX65 launch : ఇండియా మార్కెట్లో తమ బైక్స్ పోర్ట్‌ఫోలియోను పెంచుకునే పనిలో పడింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కవాసకి. తాజాగా.. రెండు కొత్త అడ్వెంచర్ బైక్స్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అవి కవాసకి కేఎక్స్65, కేఎక్స్112. సంస్థ నుంచి వస్తున్న చౌకైన అడ్వెంచర్ వెహికిల్స్‌గా ఇవి గుర్తింపు తెచ్చుకోనున్నాయి. వీటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ. 3.12లకషలు- రూ. 4.87లక్షలు.
అడ్వెంచర్ బైక్స్ విశేషాలివే..
కవాసకి కేఎక్స్65 సైజు చిన్నగా ఉంటుంది. సంస్థ నుంచి వస్తున్న చౌకైన మోడల్ ఇదే. దీని బరువు 60కేజీలు. ఇందులో 64సీసీ, లిక్విడ్ కూల్డ్ 2 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఉంటుంది. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ లభిస్తోంది. 14 ఇంచ్ మల్టీస్పోక్ ఫ్రెంట్ వీల్, 12 ఇంచ్ రేర్ వీల్ దీని సొంతం. ఇక ఫ్రెంట్లో 32ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, రేర్‌లో మోనోషాక్ అబ్సార్బర్లు వస్తున్నాయి. రెండు వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్‌ను ఇచ్చింది ఆటోమొబైల్ సంస్థ.
Kawasaki KX65 price : ఇక కవాసకి కేఎక్స్112 ని మిడ్ లెవల్ ఆఫ్‌రోడ్ సెగ్మెంట్ కోసం డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. లైమ్ గ్రీమ్ థీమ్ ఇందులో ఉంటుంది. ఇందులో 112 సీసీ, 2 స్పోక్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఎగ్సాస్ట్ పవర్ వాల్స్ ఈ ఇంజిన్‌కు వస్తున్నాయి. 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఈ అడ్వెంచర్ బైక్‌లో ఉంటుంది. 19 ఇంచ్ ఫ్రెంట్, 16 ఇంచ్ రేర్ వీల్స్ వస్తున్నాయి. సస్పెన్షన్స్ విషయానికొస్తే.. ఫ్రెంట్లో 36ఎంఎం యూఎస్డీ ఫోర్క్స్, రేర్‌లో మోనోషాక్ అబ్సాబర్స్ లభిస్తున్నాయి.
ఇదీ చూడండి:- Kawasaki Ninja 300 : 2023 కవాసకి నింజా 300 లాంచ్.. కొత్త అప్డేట్స్ ఇవే!
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కొన్ని కవాసకి బైక్స్‌కు ఇండియా రోడ్లపై పర్మీషన్ లేదు! వీటిని రేసింగ్ కోసమే తయారు చేయడం కారణంగా.. ఈ బైక్స్‌లో హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్, టర్న్ ఇండికేటర్స్, రేర్ వ్యూ మిర్రర్ వంటివి ఉండవు. ఫలితంగా వీటిని సాధారణ రోడ్లపై నడపడానికి వీలు లేదు.
Kawasaki KX112 launch : ఇక ఇండియా మార్కెట్లో కవాసకి కేఎక్స్100, కేఎక్స్250, కేఎక్స్450, కేఎల్ఎక్స్110, కేఎల్ఎక్స్140జీ, కేఎల్ఎక్స్450ఆర్ వంటి అడ్వెంచర్ మోడల్స్ ఉన్నాయి.
సంబంధిత కథనం