2023 Kawasaki Ninja 300 launched : నింజా 300 అప్డేటెడ్ మోడల్‌ను లాంచ్ చేసింది ఇండియా కవాసకి మోటార్స్. ఈ 2023 కవాసకి నింజా 300 బైక్.. మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. అవి లైమ్ గ్రీన్, కాండీ లైమ్ గ్రీన్, మెటాలిక్ మూన్డస్ట్ గ్రే. ఈ అప్డేటెడ్ వర్షెన్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 3.43లక్షలుగా ఉంది.
ఈ బైక్‌లో లిక్వ్‌డ్ కూల్డ్, 4 స్ట్రోక్ పారలెల్ ట్విన్ 296సీసీ డీఓహెచ్సీ ఇంజిన్ ఉంటుంది. ఇదొక 8 వాల్వ్ ఇంజిన్. ఇది 39 పీఎస్ పీక్ పవర్‌ను, 26.1 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో డ్యూయెల్ థ్రాటిల్ వాల్వ్‌లు ఉండటంతో కంబషన్ ఎఫీషియెన్సీ పెరుగుతుంది. ఫలితంగా ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా మెరుగవుతుంది. ఈ 2023 కవాసకి నింజా 300లో స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టెమ్, హీట్ మేనేజ్మెంట్, రేస్ డిరైవ్డ్ క్లచ్ టెక్నాలజీ వంటివి లభిస్తున్నాయి.
2023 Kawasaki Ninja 300 price : ఈ అప్డేటెడ్ మోడల్లో హై టెన్సైల్ డైమెండ్ ఛాసిస్ ఉంది. సైలెన్సర్ చిన్నగా ఉంటుంది. ఫ్రెంట్లో 290ఎంఎం పెటల్ డిస్క్ బ్రేక్, రేర్‌లో 220ఎంఎం పెటల్ డిస్క్ బ్రేక్‌లు వస్తున్నాయి.
ఇక డిజైన్ విషయానికొస్తే.. 2023 కవాసకి నింజeా 300 మోడల్లో డ్యూయెల్ హెడ్‌ల్యాంప్ అగ్రెసివ్ లుక్‌ను ఇస్తుంది. స్పోర్టీ బైక్ ఫీల్ వస్తుంది. మల్టీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉండటం కారణంగా.. రాత్రి పూట మెరుగైన వెలుతురు కనిపిస్తుంది. బిల్ట్ ఇన్ ఫ్రెంట్ టర్న్ సిగ్నల్స్, స్లీకర్స్ వంటివి వస్తున్నాయి.
ఈ ఏడాది భారత్‍లో మరిన్ని అదిరిపోయే బైక్స్ లాంచ్ కానున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని మోడల్స్ విడుదల కానున్నాయి. రాయల్ ఎన్‍ఫీల్డ్ నుంచి కేటీఎం వరకు చాలా కంపెనీల నుంచి కొన్ని ఆకర్షణీయమైన బైక్‍లు రానున్నాయి. డిఫరెంట్ స్టైల్, విభిన్నమైన డిజైన్‍లతో కొన్ని మోటార్ సైకిల్స్ అడుగుపెట్టనున్నాయి. అలా ఈ ఏడాది భారత మార్కెట్‍లో విడుదల కానున్న ముఖ్యమైన టాప్-5 బైక్‍లు ఏవో తెలుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం