Upcoming Bikes: ఈ ఏడాది భారత్‍లో లాంచ్ కానున్న ముఖ్యమైన టాప్-5 బైక్‍లు ఇవే-top 5 most anticipated upcoming motorcycles launched in this year in india ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Top 5 Most Anticipated Upcoming Motorcycles Launched In This Year In India

Upcoming Bikes: ఈ ఏడాది భారత్‍లో లాంచ్ కానున్న ముఖ్యమైన టాప్-5 బైక్‍లు ఇవే

Upcoming Bikes: ఈ ఏడాది భారత్‍లో లాంచ్ కానున్న ముఖ్యమైన టాప్ 5 బైక్‍లు ఇవే (Photo: HT Auto)
Upcoming Bikes: ఈ ఏడాది భారత్‍లో లాంచ్ కానున్న ముఖ్యమైన టాప్ 5 బైక్‍లు ఇవే (Photo: HT Auto)

Upcoming Bikes: భారత్‍లో ఈ ఏడాది లాంచ్ కానున్న టాప్ 5 ముఖ్యమైన బైక్‍లు ఇవే. వీటి కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఆ మోడల్స్ ఏవో ఇక్కడ చూడండి.

Upcoming Bikes: ఈ ఏడాది భారత్‍లో మరిన్ని అదిరిపోయే బైక్స్ లాంచ్ కానున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొన్ని మోడల్స్ విడుదల కానున్నాయి. రాయల్ ఎన్‍ఫీల్డ్ నుంచి కేటీఎం వరకు చాలా కంపెనీల నుంచి కొన్ని ముఖ్యమైన బైక్‍లు రానున్నాయి. డిఫరెంట్ స్టైల్, విభిన్నమైన డిజైన్‍లతో కొన్ని మోటార్ సైకిల్స్ అడుగుపెట్టనున్నాయి. అలా ఈ ఏడాది భారత మార్కెట్‍లో విడుదల కానున్న ముఖ్యమైన టాప్-5 బైక్‍లు ఏవో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ 450

సరికొత్త రాయల్ ఎన్‍ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ బైక్‍ను రాయల్ ఎన్‍ఫీల్డ్ భారత్‍లో లాంచ్ చేయనుంది. 450cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‍తో ఈ బైక్ రానుంది. ఎస్ఈడీ లైట్స్, కొత్త టీఎఫ్‍టీ కలర్ ఇన్‍స్ట్రుమెంటర్ క్లస్టర్, అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్, పెద్ద డిస్క్ బ్రేకులు, డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లతో ఈ హిమాలయన్ 450 బైక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే టెస్ట్ చేస్తున్న సమయంలో ఈ బైక్ చాలా సార్లు కెమెరా కళ్లకు చిక్కింది.

ట్రయంఫ్ బజాజ్ స్క్రాంబ్లర్

ట్రయంఫ్ బజాజ్ స్క్రాంబ్లర్ బైక్ గ్లోబల్‍గా బ్రిటన్‍లో ఈ ఏడాది జూన్ 27వ తేదీన లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇండియాకు రానుంది. ఈ బజాజ్ స్క్రాంబ్లర్ బైక్ 400cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‍ను కలిగి ఉండే ఛాన్స్ ఉంది. సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. 30 నుంచి 40 Nm మధ్య టార్క్యూను జనరేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ ట్రయంఫ్ బజాజ్ స్క్రాంబ్లర్ ధర సుమారు రూ.2.50లక్షల దరిదాపుల్లో ఉండొచ్చు.

హ్యార్లీ డేవిడ్‍సన్ ఎక్స్440

హ్యార్లీ డేవిడ్‍సన్ ఎక్స్440 బైక్ ఇండియాలో ఈ ఏడాది జూలై 3న విడుదల కానుంది. హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో హ్యార్లీ డేవిడ్‍సన్ ఈ బైక్‍ను తయారు చేస్తోంది. 440cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‍తో ఈ ఎక్స్440 బైక్ రానుంది. సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్ ఉండే అవకాసం ఉంది. 8,000 rpm వరకు ఈ బైక్ సామర్థ్యం ఉంటుందని ఇటీవల సమాచారం లీకైంది.

కేటీఎం 390 డ్యూక్

కొత్త జనరేషన్ 390 డ్యూక్ బైక్‍ను రానున్న నెలల్లో భారత్‍లో లాంచ్ చేయనుంది కేటీఎం. ప్రస్తుత మోడల్‍తో పోలిస్తే డిజైన్, టెక్‍లో చాలా అప్‍గ్రేడ్లతో ఈ నయా మోడల్ వస్తుంది. ఫ్రేమ్‍ కూడా కొత్తగా ఉంటుంది. 373cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‍తోనే ఈ బైక్ రానుంది. అప్‍గ్రేడెడ్ టీఎఫ్‍టీ కలర్ డిస్‍ప్లే, ఫ్రెష్ ఇంటర్ఫేస్ ఉండనుంది.

యమహా వైజెడ్ఎఫ్-ఆర్3

ఓ డీలర్ ఈవెంట్‍లో వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్‍ను యమహా ఇండియా ప్రదర్శించింది. రానున్న నెలల్లో ఈ బైక్‍ను యమహా భారత మార్కెట్‍లోకి తీసుకురానుంది. 321cc ట్విన్ సిలిండర్ లిక్విడ్ కాల్డ్ ఇంజిన్‍తో ఈ బైక్ రానుంది. 42PS, 29.5Nm టార్క్యూను ఈ యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్ జనరేట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఫుల్లీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్‍తో ఈ బైక్ రానుంది.

టాపిక్