Kawasaki Eliminator vs Royal Enfield Super Meteor 650 : ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్?-kawasaki eliminator vs royal enfield super meteor 650 check price and other detail here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kawasaki Eliminator Vs Royal Enfield Super Meteor 650 : ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్?

Kawasaki Eliminator vs Royal Enfield Super Meteor 650 : ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్?

Sharath Chitturi HT Telugu
Mar 27, 2023 06:22 AM IST

Kawasaki Eliminator vs Royal Enfield Super Meteor 650 : కవాసకి ఎలిమినేటర్​, రాయల్​ ఎన్​ఫీల్డ్​ సూపర్​ మీటియర్​ 650లో ది బెస్ట్​ ఏది? ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్?
ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్?

Kawasaki Eliminator vs Royal Enfield Super Meteor 650 : ప్రముఖ జపనీస్​ బైక్​ తయారీ సంస్థ కవాసకి.. 2023 ఎలిమినేటర్​ వర్షెన్​ను అంతర్జాతీయంగా లాంచ్​ చేసింది. రెండు దశాబ్దాల తర్వాత ఎలిమినేటర్​ మళ్లీ రోడ్లపైకి వచ్చింది. ఈ మోడల్​కు మంచి డిమాండే కనిపిస్తోంది. ఇండియాలో ఇది త్వరలోనే లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ సూపర్​ మీటియర్​ 650 నుంచి కవాసకి ఎలిమినేటర్​కు గట్టి పోటీ తప్పదని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏది బెటర్​ అన్నది తెలుసుకుందాము..

కవాసకి ఎలిమినేటర్​ వర్సెస్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ సూపర్​ మీటియర్​ 650- లుక్స్​..

Kawasaki Eliminator price : కవాసకి ఎలిమినేటర్​లో నియో- రెట్రో డిజైన్​ ఉంటుంది. స్లోపింగ్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, వైడ్​ హాండిల్​బార్​, రౌండ్​ హెడ్​ల్యాంప్​, స్ప్లిట్​ టైప్​ సీట్​, సైడ్​ మౌంటెడ్​ ఎగ్సాస్ట్​, డిజైనర్​ అలాయ్​ వీల్స్​, స్లీక్​ ఎల్​ఈడీ టెయిల్​ల్యాంప్​ వంటివి ఉంటాయి.

Royal Enfield Super Meteor 650 on road price in Hyderabad : ఇక రాయల్​ ఎన్​ఫీల్డ్​ సూపర్​ మీటియర్​ 650లో క్రూజర్​ సిల్హాయిట్​ డిజైన కనిపిస్తుంది. టియర్​డ్రాప్​ షేప్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, సర్క్యులర్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్​, వైడ్​ హాండిల్​బార్​, అడ్జస్టెబుల్​ లెవర్స్​, డ్యూయెల్​ సైడ్​ మౌంటెడ్​ ఎగ్సాస్ట్​, అలాయ్​ వీల్స్​ ఉంటాయి.

కవాసకి ఎలిమినేటర్​ వర్సెస్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ సూపర్​ మీటియర్​ 650- ఇంజిన్​..

Kawasaki Eliminator India launch : కవాసకి ఎలిమినేటర్​లో 398సీసీ లిక్వ్​డ్​ కూల్డ్​ డీఓహెచ్​సీ, పారలెల్​ ట్విన్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 47.3 హెచ్​పీ పవర్​ను, 37 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ సూపర్​ మీటియర్​ 650లో 648సీసీ, ఎయిర్​ అండ్​ ఆయిల్​ కూల్డ్​, పారలెల్​ ట్విన్​ మోటార్​ ఉంటుంది. ఇది 47హెచ్​పీ పవర్​ను, 52ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

ఈ రెండు బైక్స్​లోనూ 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.

కవాసకి ఎలిమినేటర్​ వర్సెస్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ సూపర్​ మీటియర్​ 650- సేఫ్టీ..

Kawasaki Eliminator features : సేఫ్టీ ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ రెండు బైక్స్​లోనూ డిస్క్​ బ్రేక్స్​ (ఫ్రెంట్​, రేర్​), డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ వంటివి ఉన్నాయి. కాగా కవాసకిలో టెలిస్కోపిక్​ ఫ్రెంట్​ ఫోర్క్స్​ వస్తుండగా.. ఎన్​ఫీల్డ్​లో 43ఎంఎం ఇన్​వర్టెడ్​ ఫోర్క్స్​ లభిస్తున్నాయి.

రెండు బైక్స్​లోనూ రేర్​ ఎండ్​లో డ్యూయెల్​ షాక్​ అబ్సార్బర్​ యూనిట్స్​ వస్తున్నాయి.

కవాసకి ఎలిమినేటర్​ వర్సెస్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ సూపర్​ మీటియర్​ 650- ధర..

Royal Enfield Super Meteor 650 price : రాయల్​ ఎన్​ఫీల్డ్​ సూపర్​ మీటియర్​ 650 ఎక్స్​షోరూం ధరలు రూ. 3.49లక్షలు- రూ. 3.79లక్షల మధ్యలో ఉంటుంది. 2023 కవాసకి ఎలిమినేటర్​ ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. కాగా జపాన్​ దీని ధర 7,59,000 జపనీస్​ యెన్​. అంటే దాదాపు రూ. 4.78లక్షలు.

WhatsApp channel

సంబంధిత కథనం