Royal Enfield new 650 cc bikes: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్..-royal enfield launches 2023 interceptor 650 continental gt 650 with alloys ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Royal Enfield Launches 2023 Interceptor 650, Continental Gt 650 With Alloys

Royal Enfield new 650 cc bikes: రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్..

రాయల్ ఎన్ ఫీల్డ్ న్యూ 2023 మోడల్ 650  బైక్స్
రాయల్ ఎన్ ఫీల్డ్ న్యూ 2023 మోడల్ 650 బైక్స్ (HT AUTO)

Royal Enfield new 650 cc bikes: అలాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లతో కొత్త ఇంటర్ సెప్టర్ 650ని, కాంటినెంటల్ జీటీ 650 ని రాయల్ ఎన్ ఫీల్డ్ లాంచ్ చేసింది.

Royal Enfield new 650 cc bikes: ఈ 2023 మోడల్ ఇంటర్ సెప్టర్ 650 (Interceptor 650), కాంటినెంటల్ జీటీ 650 (Continental GT 650) మోడల్ బైక్స్ ను ఇటీవలనే రాయల్ ఎన్ ఫీల్డ్ భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటిలో ఇంటర్ సెప్టర్ 650 (Interceptor 650) నాలుగు కొత్త రంగుల్లో లభిస్తుంది. అవి బ్లాక్ రే(Black Ray), బార్సిలోనా బ్లూ (Barcelona Blue), బ్లాక్ పెరల్ (Black Pearl), కాలి గ్రీన్ (Cali Green). అలాగే, కాంటినెంటల్ జీటీ 650 (Continental GT 650) రెండు కలర్ స్కీమ్స్ లో లభిస్తుంది. అవి స్లిప్ స్ట్రీమ్ బ్లూ (Slipstream Blue), అపెక్స్ గ్రే (Apex Grey). ఇప్పటికే అందుబాటులో ఉన్న కలర్స్ కు ఇవి అదనం.

ట్రెండింగ్ వార్తలు

Royal Enfield new 650 cc bikes: ధర మూడు లక్షలకు పైగానే..

2023 మోడల్ ఇంటర్ సెప్టర్ 650 (Interceptor 650) ఎక్స్ షో రూమ్ ధర రూ. 3.03 లక్షలుగా నిర్ణయించారు. అలాగే, 2023 మోడల్ కాంటినెంటల్ జీటీ 650 (Continental GT 650) ఎక్స్ షో రూమ్ ధర రూ. 3.19 లక్షలుగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న కస్టమర్లు మార్చి 17 నుంచి ఈ బైక్ లను బుక్ చేసుకోవచ్చు.

న్యూ కాంటినెంటల్ జీటీ 650
న్యూ కాంటినెంటల్ జీటీ 650 (Royal Enfield)

ఈ రెండు మోడల్స్ లోనూ కొత్తగా స్విచ్ గేర్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, యూఎస్బీ పోర్ట్ లను ఏర్పాటు చేశారు.

న్యూ ఇంటర్ సెప్టర్ 650
న్యూ ఇంటర్ సెప్టర్ 650 (Royal Enfield)

2023 మోడల్ ఇంటర్ సెప్టర్ 650 (Interceptor 650), కాంటినెంటల్ జీటీ 650 (Continental GT 650) మోడల్ బైక్స్ లో అలాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 648 cc ఎయిర్ ఆయిల్ కూల్డ్, ట్విన్ ఇంజిన్ ను అమర్చారు.

WhatsApp channel