తెలుగు న్యూస్ / ఫోటో /
Honda SP160: స్టన్నింగ్ డిజైన్ తో వచ్చిన హోండా ఎస్ పీ 160 బైక్ ను చూశారా?
Honda SP160: హోండా సంస్థ నుంచి సరికొత్త మోటార్ సైకిల్ హోండా ఎస్పీ 160 లాంచ్ అయింది. ఈ బైక్ లో కూడా ఎక్స్ బ్లేడ్ లో వాడిన ఇంజన్ నే వాడారు. ఇది 7500 ఆర్పీఎం వద్ద 13.27 బీహెచ్పీ పవర్ ను, 5500 ఆర్పీఎం వద్ద 14.58 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ను పొందుపర్చారు.
(1 / 9)
హోండా సంస్థ నుంచి సరికొత్త మోటార్ సైకిల్ లాంచ్ అయింది. ఇందులో 160 సీసీ ఇంజన్ ఉంది. ఈ సీసీలో ఇప్పటికే ఈ కంపెనీ నుంచి యూనికార్న్, ఎక్స్ బ్లేడ్ బైక్ మోడల్స్ ఉన్నాయి.
(2 / 9)
హోండా ఎస్పీ 160 సింగిల్ డిస్క్, డ్యుయల్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. సింగిల్ డిస్క్ ధర రూ. 1,17,500, డ్యుయల్ డిస్క్ ధర రూ. 1,21,900. 160 సీసీ సెగ్మెంట్లో ఈ బైక్ దే అత్యంత తక్కువ ధర.
(3 / 9)
ఈ హోండా ఎస్పీ 160 ఆరు రంగుల్లో లభిస్తుంది. అవి డార్క్ బ్లూ మెటాలిక్, స్పార్టన్ రెడ్, గ్రే మెటాలిక్, బ్లాక్, డీప్ గ్రౌండ్ గ్రే, మార్వెల్ బ్లూ. బైక్ డిజైన్ కొంతవరకు ఎస్పీ 125 ను పోలి ఉంటుంది.
(4 / 9)
ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది. ఫ్యుయెల్ ట్యాంక్ డిజైన్ ను స్పోర్టీ లుక్ తో తీర్చి దిద్దారు. సీట్ డిజైన్ కూడా డ్రైవ్ చేసే వ్యక్తికి, వెనుక కూర్చున్న వ్యక్తికి సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు.
(5 / 9)
క్లాక్, సర్వీస్ డ్యూ ఇండికేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి సమాచారంతో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ను రూపొందించారు. ఫ్యుయెల్ గాగ్ తో పాటు సగటు మైలేజీ, యావరేజ్ స్పీడ్ వంటి వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.
(6 / 9)
ఈ ఎస్పీ 160 బైక్ లో ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్, సింగిల్ చానెల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హజార్డ్ లైట్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సైడ్ ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్స్ ఎల్ఈడీవి కావు. అలాగే, బ్లూ టూత్ కనెక్టివిటీ కూడా లేదు.
(7 / 9)
డైమండ్ షేప్ ఫ్రేమ్ తో సస్పెండెడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ముందువైపు, మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ వెనుక వైపు అమర్చారు. ముందు వీల్ కు 276 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక వీల్ కు, వేరియంట్ ను బట్టి 130 ఎంఎం డ్రమ్ బ్రేక్ లేదా 220 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి.
(8 / 9)
ఎస్పీ 160, ఎక్స్ బ్లేడ్.. ఈ రెండు మోడల్స్ ఒకే ఇంజన్ ను ఉపయోగించారు. ఇది 162.71 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్. ఈ ఇంజన్ 7500 ఆర్పీఎం వద్ద 13.27 బీహెచ్పీ పవర్ ను, 5500 ఆర్పీఎం వద్ద 14.58 ఎన్ఎం పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ను పొందుపర్చారు.
ఇతర గ్యాలరీలు