తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ysrcp Mp Vijayasari Reddy Demands For Bc Reservation On Population Basis

MP Vijayasai Reddy :జనాభా ప్రాతిపాదికపై బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

B.S.Chandra HT Telugu

09 December 2022, 13:25 IST

    • MP Vijayasai Reddy జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో డిమాండ్ చేశారు. రాజ్య సభ జీరో అవర్‌లో బీసీ రిజర్వేషన్ల అంశాన్నివిజయసాయిరెడ్డి లేవనెత్తారు.  దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు ప్రజలు 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్‌ 27 శాతానికే పరిమితమైందని, రిజర్వేషన్‌ సీలింగ్‌ 50 శాతం మించి ఉండొచ్చని ఈ గరిష్ట పరిమితి సవరించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘన ఏమాత్రం కాబోదు అంటూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయ స్థానం కూడా అభిప్రాయపడిందని విజయసాయి రెడ్డి తెలిపారు
రాజ్యసభ జీరో అవర్‌‌లో మాట్లాడుతున్న ఎంపీ సాయిరెడ్డి
రాజ్యసభ జీరో అవర్‌‌లో మాట్లాడుతున్న ఎంపీ సాయిరెడ్డి

రాజ్యసభ జీరో అవర్‌‌లో మాట్లాడుతున్న ఎంపీ సాయిరెడ్డి

MP Vijayasai Reddy వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో శుక్రవారం ఈ అంశాన్ని లేవనెత్తారు. దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురైన వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థల్లో రిజర్వేషన్‌ కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేయడమే వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దినట్లు అవుతుందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Konaseema Accident: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం, ఆటోను ఢీకొన్న లారీ

AP Pensions : మే నెల పెన్షన్లు నేరుగా ఖాతాల్లోనే, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP LAWCET 2024 : ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు, మే 4 వరకు అవకాశం

IRCTC Tripura Tour Package : త్రిపుర ప్రకృతి అందాలపై ఓ లుక్కేయండి, 6 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదిగో!

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 75వ సంవత్సరం జరుగుతోందని, 75 ఏళ్ళలో దేశం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని కానీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి విషయంలో మాత్రం స్వతంత్ర భారతావని విఫలమైందన్న విషయం కఠోర వాస్తవం అని సాయి రెడ్డి అన్నారు. అన్ని రంగాలలో తమకు సమాన అవకాశాలు ఉండాలన్న వెనుకబడిన తరగతుల ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష మాత్రం ఈనాటికీ నెరవేరలేదని చెప్పారు.

దేశంలో షెడ్యూల్డు కులాలు, తెగల జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, వెనుకబడిన కులాలను అన్యాయంగా కుల గణన నుంచి విస్మరించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్‌ కల్పించ లేకపోయామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలో వారికి న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్‌ దక్కలేదని శ్రీ విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.

దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు ప్రజలు 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్‌ 27 శాతానికే పరిమితమైందని, రిజర్వేషన్‌ సీలింగ్‌ 50 శాతం మించి ఉండొచ్చని ఈ గరిష్ట పరిమితి సవరించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘన ఏమాత్రం కాబోదు అంటూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయ స్థానం కూడా అభిప్రాయపడిందని విజయసాయి రెడ్డి తెలిపారు.

ఈ నేపధ్యంలో వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పించడంలో ప్రభుత్వానికి న్యాయపరమైన అవరోధాలు కూడా ఏమీ ఉండబోవని, బీసీలకు విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో వారి జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్‌ కల్పించేందుకు అవసరమైన అని చర్యలు చేపట్టాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

టాపిక్