తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Mla Golla Baburao : అనకాపల్లి వైసీపీలో ముదిరిన విభేదాలు.... ఆందోళనలు

Ysrcp Mla Golla Baburao : అనకాపల్లి వైసీపీలో ముదిరిన విభేదాలు.... ఆందోళనలు

HT Telugu Desk HT Telugu

24 September 2022, 13:17 IST

    • Ysrcp Mla Golla Baburao అనకాపల్లి జిల్లాలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాయకారావుపేటలో ఎమ్మెల్యే బాబురావుకు అసమ్మతి పోరు మళ్లీ మొదలైంది. ఎస్.రాయవరం మండలం గుడివాడలో శంకుస్థాపనకు వచ్చిన గొల్ల బాబూరావును అసమ్మతి వర్గం అడ్డుకుంది. వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును స్థానిక ఎంపీటీసులు, సర్పంచులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎంపీపీ రాజీనామా చేయడంతో స్థానికంగా పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. 
పాయకారావుపేటలో ఎమ్మెల్యే గొల్లబాబురావుకు అసమ్మతి సెగ
పాయకారావుపేటలో ఎమ్మెల్యే గొల్లబాబురావుకు అసమ్మతి సెగ

పాయకారావుపేటలో ఎమ్మెల్యే గొల్లబాబురావుకు అసమ్మతి సెగ

Ysrcp Mla Golla Baburao అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వైకాపాలో విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వ్యతిరేక వర్గానికి చెందిన ఎస్‌.రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారదా కుమారి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే బాబూరావు ఇబ్బందులకు గురి చేస్తున్నారని నియోజక వర్గ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా పరిషత్తు సీఈఓ సత్యనారాయణకు ఆమె రాజీనామా లేఖ అందజేశారు.

ట్రెండింగ్ వార్తలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

Ysrcp Mla Golla Baburao స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్‌.రాయవరం మండలంలోని 21 సెగ్మెంట్లలో 17 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందారని, వారందరి మద్దతుతో ఎంపీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎమ్మెల్యే వైఖరిలో మార్పును గమనించామని ఎంపీపీ ఆరోపించారు. తిమ్మాపురం, గుడివాడ సర్పంచులను ఇబ్బందులకు గురి చేసి ఆర్థికంగా దెబ్బతీశారని, తమ వల్ల ఎవరికీ ఏ కష్టం రాకూడదనే ఎంపీపీ పదవికి రాజీనామా చేశానని ఎంపీపీ చెప్పారు.

ఎంపీ విజయసాయిరెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు కొద్దిరోజులు ఓపిక పట్టాలని గతంలో సూచించారని, ఇక్కడున్న పరిస్థితులతో పదవిని త్యజించాల్సి వచ్చిందని చెప్పారు. ఎప్పటికీ వైఎస్‌ కుటుంబానికి విధేయులుగా ఉంటామని, వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా'మని స్పష్టం చేశారు. శారదాకుమారి భర్త, వైకాపా జిల్లా కోశాధికారి బొలిశెట్టి గోవిందరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మద్దతు లేకపోతే ఎమ్మెల్యే గొల్ల బాబూరావు Ysrcp Mla Golla Baburao వార్డు సభ్యుడిగా కూడా గెలవలేరని విమర్శించారు.

డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత ఎమ్మెల్యే నాయకులు, కార్యకర్తలకు ఇవ్వడం లేదని ఆరోపించారు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి ఇచ్చేందుకు ఎమ్మెల్యే రూ.10 లక్షలు వసూలు చేశారని, పాయకారావు పేట నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల నుంచి వసూళ్లు చేస్తున్నారని. లింగరాజుపాలెంలోని బీసీ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేశారని గోవిందరావు ఆరోపించారు.

అనకాపల్లి జిల్లాలో వైసీపీలోని ఇరువర్గాల మధ్య తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాయకారావుపేటలో ఎమ్మెల్యే బాబురావుకు అసమ్మతి పోరు మళ్లీ మొదలైంది. ఎస్.రాయవరం మండలం గుడివాడలో శంకుస్థాపనకు వచ్చిన గొల్ల బాబూరావును అసమ్మతి వర్గం అడ్డుకుంది. వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావును స్థానిక ఎంపీటీసులు, సర్పంచులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహన శ్రేణిని అడ్డుకున్నారు. పోలీసు వాహనం ముందు సర్పంచ్ శ్రీనుబాబు, అప్పలరాజు బైఠాయించారు. ప్రోటోకాల్ విషయమై సొంత పార్టీ నేతలతోనే ఎమ్మెల్యేతో విభేదాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యేతో విభేదించి నిన్న ఎంపీపీ పదవికి శారదాదేవి రాజీనామా చేశారు.

టాపిక్