తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr It Agency : రూ.50 కోట్లతో వైఎస్సార్‌ ఐటీ ఏజెన్సీ

YSR IT Agency : రూ.50 కోట్లతో వైఎస్సార్‌ ఐటీ ఏజెన్సీ

HT Telugu Desk HT Telugu

01 August 2022, 20:27 IST

    • వైఎస్సార్‌ ఐటీ ఏజెన్సీ రూ.50 కోట్ల వ్యయంతో స్థాపించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి అన్నారు. భవిష్యత్తులో గూగుల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకునే ఉద్దేశం ఉందన్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ కళాశాల ప్రాంగణంలో స్థాపించిన క్లస్టర్‌ యూనివర్సిటీలో మైక్రోసాఫ్ట్‌ అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ధ్రువపత్రాలను అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగ సాధనలో విద్యార్థులను ముందు వరుసలో నిలిపే కార్యక్రమాన్ని కేవలం వర్సిటీలో డిజైన్‌ చేశారన్నారు. రూ.50 కోట్లతో వైఎస్సార్‌ ఐటీ ఏజెన్సీ రూ.50 కోట్ల వ్యయంతో స్థాపించనున్నట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు జారీ

AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

'కర్నూలులోని మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 460 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. 252 మంది ఉత్తీర్ణత సాధించడం ఒక గొప్ప విషయం. భవిష్యత్ లో గూగుల్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకునే ఉద్దేశం ఉంది.' అని హేమచంద్రారెడ్డి అన్నారు.