తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Boy Friend Wedding : ముందు జైలుకు పంపి.. తర్వాత పెళ్లివేడుకకు పెట్రోల్‌తో వచ్చింది

Boy Friend Wedding : ముందు జైలుకు పంపి.. తర్వాత పెళ్లివేడుకకు పెట్రోల్‌తో వచ్చింది

HT Telugu Desk HT Telugu

04 December 2022, 17:19 IST

    • Gajuwaka Wedding : ఓ యువతి తనను మోసం చేసిన ప్రియుడిపై కేసు పెట్టి జైలుకు పంపింది. జైలు నుంచి విడుదలైన యువకుడు మళ్లీ పెళ్లి చేసుకుంటుండగా అదే యువతి పెళ్లి వేడుక దగ్గరకు పెట్రోల్ తో వచ్చింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT telugu)

ప్రతీకాత్మక చిత్రం

మాజీ ప్రియుడి(Ex Lover) పెళ్లి వేడుకలో ఓ యువతి హంగామా చేసింది. కొన్నిరోజుల కిందట తనను మోసం చేశాడని చెప్పి పోలీసు కేసు(Police Case) పెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. తాజాగా మరో యువతితో పెళ్లి చేసుకుంటుండగా.. పెట్రోల్ బాటిల్(Petrol Bottle) తీసుకుని వచ్చింది. పోలీసులకు తెలిసి వచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

విశాఖపట్నం.. జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాం గ్రామానికి చెందిన ఎం.విజయ్ భగత్ ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. పార్వతీపురానికి(Parvathipuram) చెందిన ప్రియాంక అనే యువతిని ప్రేమించాడు. కొంతకాలం ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. కానీ మెల్లమెల్లగా మనస్పర్థాలు రావడం మెుదలయ్యాయి. దీంతో ప్రియాంకను విజయ్ విడిచిపెట్టాడు. ఎలాగైనా ఇక పట్టించుకోవద్దనుకున్నాడు. కానీ ఈ విషయాన్ని ప్రియాంక అంత తేలిగ్గా తీసుకోలేదు.

మే నెలలో నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోసం చేశాడని కేసు పెట్టింది. దీంతో యువకుడికి కొన్ని రోజులు జైలు శిక్ష పడింది. జైలు నుంచి బయటకు వచ్చాడు విజయ్. మరో మహిళతో వివాహానికి(Marriage) సిద్ధమయ్యాడు. శనివారం నాతియాపాలెంలో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ప్రియాంకకు తెలిసింది.

తన బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి మండపం వద్దకు వెళ్లింది. తన వెంట అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తో బెదిరించింది. దీంతో అక్కడ వాతావరణం మారిపోయింది. ఈ విషయం గాజువాక(Gajuwaka) పోలీసులకు తెలిసి.. ఘటన స్థలానికి వచ్చారు. సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కోర్టు పరిధిలోని వ్యవహారంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. ఎలాంటి చర్యలు పాల్పడవద్దని సూచించారు.