తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Vijayawada To Sharjah Direct Flight Services Started

Vijayawada To Sharjah విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం….

HT Telugu Desk HT Telugu

31 October 2022, 18:55 IST

    • Vijayawada To Sharjah షార్జా నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి రెండు రోజులపాటు నడువనున్నాయి. ఈ సర్వీసులు ప్రతి సోమ, శని వారాల్లో ఈ సర్వీసులు నడువనున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా వచ్చిన విమానానికి ఫైర్ సిబ్బంది రాయల్ వాటర్ సెల్యూట్ ని పలికారు. అనంతరం ప్రయాణికులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మి కాంత్ రెడ్డిలు స్వాగతం పలికారు.
విజయవాడ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్‌లు ఇస్తున్న ఎంపీలు కేశనేని నాని, బాలశౌరి
విజయవాడ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్‌లు ఇస్తున్న ఎంపీలు కేశనేని నాని, బాలశౌరి

విజయవాడ విమానాశ్రయంలో బోర్డింగ్ పాస్‌లు ఇస్తున్న ఎంపీలు కేశనేని నాని, బాలశౌరి

Vijayawada To Sharjah షార్జా నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. వారానికి రెండు రోజులపాటు నడువనున్నాయి. ఈ సర్వీసులు ప్రతి సోమ, శని వారాల్లో ఈ సర్వీసులు నడువనున్నాయి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా వచ్చిన విమానానికి ఫైర్ సిబ్బంది రాయల్ వాటర్ సెల్యూట్ ని పలికారు. అనంతరం ప్రయాణికులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మి కాంత్ రెడ్డిలు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ నుంచి వెళుతున్న ప్రయాణికులకు బోర్డింగ్ పాసులను ముఖ్య అతిథులు అందజేశారు. షార్జా నుంచి ఈ విమానంలో 50 మంది రాగా విజయవాడ నుంచి షార్జాకు 122 మంది వెళ్లారు

ట్రెండింగ్ వార్తలు

AP Govt Salaries: ఎలక్షన్ ఎఫెక్ట్‌... ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, సర్వీస్ పెన్షన్లు... ఐదేళ్లలో ఇదే రికార్డ్

Papikondalu Tour Package : గోదావరిలో పాపికొండల మధ్య బోటు ప్రయాణం- రాజమండ్రి నుంచి ఏపీ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్, నేడు కూడా సప్లిమెంటరీ ఫీజు కట్టొచ్చు…

AP TS Summer Updates: ఏప్రిల్ రికార్డు… 46 డిగ్రీలు దాటేసిన ఎండలు, మేలోను మంటలే… దడ పుట్టిస్తున్న వాతావరణం

విజయవాడ నుంచి షార్జాకు నేరుగా విమాన సర్వీసు సోమవారం నుంచి ప్రారంభమైంది. కోవిడ్‌కు ముందు నుంచి విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోవడంతో మచిలీపట్నం ఎంపీ, ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వి.బాలశౌరి పలుమార్లు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. విజయవాడ ఎంపీ కేశనేని నాని కూడా అంతర్జాతీయ సర్వీసులు పునరుద్ధరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. గోదావరి జిల్లాల నుంచి దుబాయ్‌ తదితర దేశాల్లో ఉపాధి కోసం వెళ్లే వారు హైదరాబాద్‌, చెన్నై విమానాశ్రయాలకు వెళ్లాల్సి వస్తుడటంతో ఎయిర్‌ ఇండియా విజయవాడ నుంచి విమానాలను నడిపేందుకు ముందుకు వచ్చింది.

ఈ విమానం వారానికి రెండుసార్లు నడుస్తుంది . సోమ, శనివారాలలో విమాన సర్వీసులు నడువనున్నాయి. ప్రతి శనివారం మస్కట్‌కు విమానంతో పాటు కువైట్‌కు వెళ్లే ప్రతి విమానం విజయవాడ విమానాశ్రయం నుండి కూడా నడుస్తుందని ఎంపీ బాలశౌరి తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 31 నుండి విజయవాడ-షార్జా డైరెక్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించింది.

భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి నేరుగా అంతర్జాతీయ విమానాన్ని ప్రారంభించింది. అక్టోబర్ 31 సాయంత్రం 06.35 గంటలకు ఈ విమానం షార్జా బయలుదేరి వెళ్లింది. విజయవాడ-షార్జా సెక్టార్‌కు ప్రారంభ ఛార్జీలు రూ. 13,669, షార్జా-విజయవాడ సెక్టార్‌ల ధరలు AED 399 వద్ద ప్రారంభమవుతాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ CEO అలోక్ సింగ్ మాట్లాడుతూ, "ఎయిర్ ఇండియా విజయవాడ నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

విజయవాడ - షార్జా మధ్య ఇండియా ఎక్స్‌ప్రెస్ ‌తో ప్రయాణికులకు అనువుగా ఉంటుందని అధికారులు చెప్పారు. కోవిడ్‌ మహమ్మారి రెండేళ్ల ప్రభావం తర్వాత క్రమంగా పరిస్థితులు సర్దుకుంటున్నాయి. భారతదేశం-గల్ఫ్ విమానయాన రంగంలో చురుకైన పునరుద్ధరణ కనిపిస్తోంది. ప్రస్తుతం మహమ్మారికి ముందు స్థాయికి విమానయానం తిరిగి పుంజుకుందని వివరించారు. UAEకి, ముఖ్యంగా దుబాయ్ మరియు నార్తర్న్ ఎమిరేట్స్‌కు ప్రయాణించే వారికి, షార్జాకు డైరెక్ట్ సర్వీస్ మంచి సమయానుకూలమైన విమానంతో భారీ ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.

ప్రస్తుతం, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడలో మరియు వెలుపల అంతర్జాతీయ సర్వీసులను అందిస్తున్న ఏకైక విమానయాన సంస్థగా నిలిచింది. . షార్జాతో పాటు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుండి మస్కట్ మరియు కువైట్‌లకు B737-800 NG ఎయిర్‌క్రాఫ్ట్‌‌లను నడుపనుంది. సౌకర్యవంతమైన సీట్లు, ప్రీ-ఆర్డర్ చేసిన హాట్ మీల్స్‌తో పాటు కొనుగోలు-ఆన్-బోర్డ్ మీల్ సర్వీస్, మొబైల్ ఛార్జింగ్ కోసం ఇన్-సీట్ పవర్ వంటి సదుపాయాలు ఉన్నట్లు ఎయిర్‌ ఇండియా వర్గాలు తెలిపాయి.

టాపిక్