తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Temple : తిరుమల నవంబ‌రు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల

TTD Temple : తిరుమల నవంబ‌రు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల

HT Telugu Desk HT Telugu

25 October 2022, 17:11 IST

    • Tirumala Tirupati Devasthanam : తిరుమలలో వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన ప్రత్యేక దర్శన కోటాను అక్టోబర్ 26న విడుదల చేయనున్నారు. నవంబర్ నెలకు సంబంధించి కోటా విడుదల కానుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చే వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శన కోటా విడుదల కానుంది. అక్టోబ‌రు 26వ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ(TTD) ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. నవంబర్ నెలకు సంబంధించిన ఉచిత‌ ప్రత్యేక ద‌ర్శనం టోకెన్ల కోటా విడుదల చేయనున్నారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

ట్రెండింగ్ వార్తలు

AB Venkateswararao : ఏపీ సర్కార్ కు షాక్, ఏబీవీ సస్పెన్షన్ కొట్టివేత-విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశాలు

AP PGECET 2024 : ఏపీ పీజీఈసెట్ కరెక్షన్ విండో ఓపెన్, మే 14 వరకు దరఖాస్తు సవరణలకు అవకాశం

AP Medical Colleges: ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్స్‌, ట్యూటర్‌ పోస్టులు

Bheemili Beach : మనసు దోచేస్తున్న భీమిలి బీచ్- విశాఖలోని టూరిస్ట్ ప్రదేశాలివే!

సూర్యగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8 గంట‌ల‌కు టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుచానూరు(Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురం(Srinivasa Mangapuram) శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాలను మూసివేశారు.

మంగళవారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంట‌లకు సూర్యగ్రహణం పూర్తవుతుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.