తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ttd Special Darshan Facility For Nris After Two Years

TTD NRI Darshan : ఎన్నారైలకు తిరుమలలో ప్రత్యేక దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు

HT Telugu Desk HT Telugu

27 June 2022, 14:11 IST

    • TTD NRI Darshan : కోవిడ్‌ కారణంగా రెండేళ్లకు పైగా నిలిచిపోయిన ఎన్నారై దర్శనాలను టీటీడీ పునరుద్ధరించింది. స్వదేశాలలో  బంధు మిత్రుల్ని కలిసేందుకు స్వల్ప వ్యవధిలో వచ్చే భక్తులకు వేగంగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గత రెండేళ్లుగా కోవిడ్ వ్యాప్తితో పాటు విదేశీ ప్రయాణికులకు దర్శనాలపై ఆంక్షలు ఉండటంతో ఎన్నారైలు స్వామి వారిని దర్శించు కోవడంలో ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎన్నారైలకు మరింత సులువుగా శ్రీవారి దర్శనం
ఎన్నారైలకు మరింత సులువుగా శ్రీవారి దర్శనం

ఎన్నారైలకు మరింత సులువుగా శ్రీవారి దర్శనం

TTD NRI Darshan : తిరుమల శ్రీవారిని దర్శనం కోసం వచ్చే ఎన్నారై భక్తుల కోసం రూ.300 టిక్కెట్లను జారీ చేసే సదుపాయాన్ని టీటీడీ పునరుద్ధరించింది. దాదాపు రెండేళ్లకు పైగా ఎన్నారై ప్రత్యేక దర్శనం టిక్కెట్లను నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఎన్నారై సర్వీసుల్ని పునరుద్ధరించారు.

ట్రెండింగ్ వార్తలు

Konaseema Accident: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం, ఆటోను ఢీకొన్న లారీ

AP Pensions : మే నెల పెన్షన్లు నేరుగా ఖాతాల్లోనే, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP LAWCET 2024 : ఏపీ లాసెట్ దరఖాస్తు గడువు పెంపు, మే 4 వరకు అవకాశం

IRCTC Tripura Tour Package : త్రిపుర ప్రకృతి అందాలపై ఓ లుక్కేయండి, 6 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదిగో!

తిరుమల తిరుపతి దేవస్థానంలో కోవిడ్‌ కారణంగా రద్దు చేసిన ఎన్నారైలకు రూ.300 దర్శన టిక్కెట్లను (TTD NRI Darshan) పునరుద్ధరించారు. తిరుమల వచ్చే ఎన్నారై భక్తులకు (ttd nri quota) రూ. 300 దర్శనం టిక్కెట్లతో ప్రత్యేక దర్శన సదుపాయాన్ని కల్పిస్తారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 హాల్ నుంచి ఎన్నారై భక్తులకు ప్రత్యేక దర్శనం క్యూలైన్లలలోకి (ttd nri break darshan) అనుమతిస్తారు.

కోవిడ్‌ కారణంగా 2020 మార్చి నుంచి అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ నిలిపివేసింది. కోవిడ్ తర్వాత పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తుండంతో ఎన్నారై సేవల్ని మళ్లీ ప్రారంభించారు. ఎన్నారై భక్తుల పాస్‌ పోర్ట్‌, వీసాలతో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాత భక్తులకు టిక్కెట్లను జారీ చేస్తారు.

రెండేళ్లుగా ఎన్నారైలకు ప్రత్యేక దర్శన సదుపాయాలను రద్దు చేయడంతో విదేశాల నుంచి పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొంత కాలంగా ఎన్నారై దర్శనాలను పునరుద్ధరించాలని టీటీడీకి ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేస్తున్నారు. వీటిపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించిన అధికారులు ఎట్టకేలకు ఎన్నారై దర్శనాన్ని పునరుద్ధరించేందు సుముఖత వ్యక్తం చేశారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో తిరుమల వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. స్వస్థలాలకు వచ్చే ఎన్నారై భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

టాపిక్