తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Arjita Seva : టీటీడీ ఆర్జిత సేవ టిక్కెట్ల విడుదల….

TTD Arjita Seva : టీటీడీ ఆర్జిత సేవ టిక్కెట్ల విడుదల….

HT Telugu Desk HT Telugu

08 February 2023, 11:23 IST

    • TTD Arjita Seva  తిరుమలలో నిర్వహించే ఆర్జిత సేవల టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఫిబ్రవరి 22 నుండి 28వ తేదీ వరకు గల వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను టిటిడి విడుదల చేసింది. 
ఆర్జిత సేవల టిక్కెట్లు విడుదల
ఆర్జిత సేవల టిక్కెట్లు విడుదల (ttd)

ఆర్జిత సేవల టిక్కెట్లు విడుదల

TTD Arjita Seva టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల చేశారు. తిరుమలలో శ్రీవారికి నిర్వహించే సేవల్లో భక్తులు పాల్గొనేందుకు వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను టిటిడి విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

AP EAPCET 2024 Hall Tickets : ఏపీ ఈఏపీసెట్ అప్డేట్, మే 7న హాల్ టికెట్లు విడుదల

TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆన్‌లైన్ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాతోపాటు, ఈ సేవల ద్వారా లభించే దర్శన కోటాను ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంచుతారు.

ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుంది.

ఇతర ఆర్జిత సేవా టికెట్లను ఫిబ్రవరి 8న మధ్యాహ్నం 12 గంటల నుండి ఆన్‌లైన్ లో బుకింగ్‌కు అందుబాటులో ఉంచుతారు.

భక్తులు ఈ విషయాన్ని గమనించి http://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగరబత్తీల రెండో యూనిట్ నిర్మాణం….

టీటీడీ గోశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు.

అధికారులతో కలసి మంగళవారం ఆమె పనుల ప్రగతిని పరిశీలించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ లో చివరి దశలో ఉన్న సివిల్, విద్యుత్ , యంత్రాల పనితీరు పరిశీలన పనులు వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.

అనంతరం ఆమె అగరబత్తీల తయారీ రెండో యూనిట్ పనులు పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి అవసరమైన పూల సరఫరా, ఇతర ఏర్పాట్ల గురించి జేఈవో అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి సదా భార్గవి మీడియాతో మాట్లాడారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటుతో గోశాలలోని గోవులు, ఎద్దులు, ఇతర జంతువులకు నాణ్యమైన దాణా తయారు చేసి అందించవచ్చునన్నారు. భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో అగరబత్తీల ఉత్పత్తిని డబుల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జేఈవో వివరించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

టాపిక్