తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Today Andhrapradesh Cm Ys Jagan Visit Delhi

CM Jagan Delhi Tour: ఢిల్లీకి సీఎం జగన్... రేపు ప్రధాని మోదీతో భేటీ..!

HT Telugu Desk HT Telugu

16 March 2023, 14:39 IST

    • CM Jagan Delhi Tour Updates: సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 04.30 గంటలకు గన్నవరం నుంచి బయల్దేరి... రాత్రి 07.30 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఢిల్లీకి సీఎం జగన్
ఢిల్లీకి సీఎం జగన్ (facebook)

ఢిల్లీకి సీఎం జగన్

CM Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు టూర్ షెడ్యూల్ ఖరారైంది. గురువారం సాయంత్రం 4.30గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరి... రాత్రి 7.30గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

రేపు ప్రధానితో భేటీ...

ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్... శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఇక ఈ పర్యటనలో అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యలతో పాటు పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.

ఉన్నట్టుండి ఢిల్లీకి..!

ఇక ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్తుండటంపై ఆసక్తికరంగా మారింది. ఓవైపు గురువారమే అసెంబ్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో సడన్ గా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా... రాజధాని అంశంపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారా..? అన్న చర్చ నడుస్తోంది. ఈ మధ్య పలు సందర్భాల్లో త్వరలోనే విశాఖపట్నానికి షిప్ట్ అయిపోతామంటూ ముఖ్యమంత్రి జగన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాజధాని విషయంపై ప్రకటన ఉంటుందని అంతా భావించారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో... ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్తుండటంతో రాజధాని అంశం కూడా ప్రధానంగా తెరపైకి వస్తోంది.

సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి సంబంధించి ఆ పార్టీ నేతల నుంచి స్పష్టమైన సమాచారం లేదు. శుక్రవారం ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసి జగన్ ఏం చర్చిస్తారనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.