LIVE UPDATES
Alluri Rains : అల్లూరి జిల్లాలో ఉప్పొంగిన వాగులు-బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు
Andhra Pradesh News Live September 8, 2024: Alluri Rains : అల్లూరి జిల్లాలో ఉప్పొంగిన వాగులు-బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు
08 September 2024, 22:33 IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Andhra Pradesh News Live: Alluri Rains : అల్లూరి జిల్లాలో ఉప్పొంగిన వాగులు-బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు
- Alluri Rains: అల్లూరి జిల్లా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. పాడేరు మండలం రాయిగడ్డ వద్ద బైక్ తో వాగు దాటుతూ యువకుడు వరదలో కొట్టుకుపోయాడు. వరదలో ఈతకొడుతూ అతికష్టమీద ఒడ్డుకు చేరుకున్నాడు.
Andhra Pradesh News Live: Tirumala : రేపు తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవాలు
- Tirumala : తిరుమలలో తిరుమలనంబి 1051వ అవతార మహోత్సవం సోమవారం నిర్వహించారు. తిరుమలనంబి ఆలయంలో ఉదయం 9.30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు తిరుమలనంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు.
Andhra Pradesh News Live: Visakha Control Room : విశాఖలో భారీ వర్షాలు, కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు-నెంబర్లు ఇవే
- Visakha Control Room : వాయుగుండం ప్రభావంతో విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ కలెక్టరేట్ లో సైక్లోన్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గోపాలపట్నంలో కొండ చరియలు విరిగిపడి ఇళ్లు ప్రమాదకరస్థితిలో ఉన్నాయి.
Andhra Pradesh News Live: Trains Information : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్- పండుగ సీజన్ దృష్ట్యా 16 ప్రత్యేక రైళ్లు, అదనపు స్టాపులు
- Trains Information : వచ్చే పండుగల సీజన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. విశాఖ వీదుగా 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. నాలుగు రైళ్లకు అదనపు స్టాపులు నిర్ణయించారు. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Andhra Pradesh News Live: Insurance Claims : ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు, విజయవాడలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు
- Insurance Claims : ఏపీలో ఇటీవల వరదలకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇండ్లు, వాహనాలు, షాపులు, వ్యాపార సంస్థలు.. తీవ్రంగా నష్టపోయాయి. ఈ నష్టాలకు ఇన్యూరెన్స్ క్లెయిమ్స్ త్వరగా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్లెయిమ్ నమోదుకు విజయవాడలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది.
Andhra Pradesh News Live: CM Chandrababu On Rains : వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపండి- సీఎం చంద్రబాబు ఆదేశాలు
- CM Chandrababu On Rains : వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడ పరిస్థితి అర్థం చేసుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
Andhra Pradesh News Live: Uttarandhra Floods : వాగులో కొట్టుకుపోయిన వాహనం.. డ్రైవరును కాపాడిన స్థానికులు.. పొంగిపొర్లుతున్న వాగులు
- Uttarandhra Floods : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాగులో కొట్టుకుపోయిన ఓ వాహనం డ్రైవర్‌ను స్థానికులు కాపాడారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Andhra Pradesh News Live: Nagarjuna University Student : నాగార్జున వర్సిటీలో పాముకాటుతో మయన్మార్ విద్యార్థి మృతి, పుట్టగొడుగుల కోసం వెళ్లి!
- Nagarjuna University Student : గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పాముకాటులో విద్యార్థి మృతి చెందాడు. మయన్మార్ కు చెందిన విద్యార్థి శనివారం సాయంత్రం పాముకాటుకు గురై మరణించాడు. వర్సిటీలో పుట్టగొడుగుల కోసం వెళ్లిన విద్యార్థిని విష సర్పం కాటు వేసింది.
Andhra Pradesh News Live: AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
- AP Schools Holiday : ఏపీని వరుణుడు ఇప్పట్లో వదిలేలా లేడు. వాయుగుండం ఎఫెక్ట్ తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో విజయనగరం జిల్లా వ్యాప్తంగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Andhra Pradesh News Live: Vinayaka Mandapam Challan : వినాయక మండపాల ఏర్పాటుకు చలాన్లు, హోంమంత్రి అనిత క్లారిటీ
- Vinayaka Mandapam Challan : ఏపీలో వినాయక మండపాల అనుమతికి చలాన్లు కట్టించుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో రుసుములను పది రోజుల కిందటే రద్దు చేశామని హోంమంత్రి తెలిపారు. మండపాల ఏర్పాటు, ఏ ఒక్క అనుమతికి డబ్బులు చెల్లించనక్కర్లేదన్నారు.
Andhra Pradesh News Live: Health Minister: వరదలొచ్చిన వారానికి వచ్చిన ఏపీ వైద్యశాఖ మంత్రి, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
- Health Minister: ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్ కృష్ణా, బుడమేరు వరదలు ముంచెత్తిన వారం రోజులకు విజయవాడ వచ్చారు. వరదసహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఆగస్టు 30వ తేదీ నుంచి విజయవాడ నగరం భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకుంటే మంత్రి వారం రోజుల తర్వాత విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు.
Andhra Pradesh News Live: Nandyal District : పండగపూట విషాదం... రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు స్పాట్ డెడ్
- Road Accident in Nandyal : పండగపూట నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్ఢ మండల పరిధిలో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదలో తల్లి, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh News Live: Budameru Floods : వద్దన్నా వినలేదు.. బుడమేరు వరదలో గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
- Budameru Floods : ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరు వరద ఇంకా తగ్గలేదు. దీంతో ప్రధాన రహదారులపై వరద ఉధృతి కొనసాగుతోంది. తాజాగా.. బుడమేరు వరదలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గల్లంతు అయ్యారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గన్నవరం నుంచి మచిలీపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Andhra Pradesh News Live: Flood ALERT : ఏపీలో మళ్లీ దంచికొడుతున్న వర్షాలు.. ఈ జిల్లాకు వరద ముప్పు!
- Flood ALERT : భారీ వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్రపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిన్నటి వరకు విజయవాడను ముంచిన వరదలు.. ఇప్పుడు తూర్పు గోదావరి, శ్రీకుళం జిల్లాపై ప్రతాపం చూపుతున్నాయి. దీంతో లోతట్ట ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh News Live: Flood Victims: విజయవాడ రూరల్ గ్రామాల్లో ఆకలి కేకలు, వారం రోజులుగా ముంపు గ్రామాల్లో అందని ప్రభుత్వ సాయం
- Flood Victims: బుడమేరు వరదతో విజయవాడ నగరంతో పాటు సమీప గ్రామాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. విజయవాడకు ఎగువున ఉన్న రూరల్ గ్రామాలు ముందు వరద తాకిడికి గురయ్యాయి. వరద సహాయక చర్యలన్నీ విజయవాడ కేంద్రంగా జరుగుతుండంటతో గ్రామీణ ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి.
Andhra Pradesh News Live: Krishna District Crime : వినాయక చవితి వేళ దారుణం.. అడగకుండా మామిడాకులు కోశాడని కత్తితో దాడి!
- Krishna District Crime : కృష్ణా జిల్లాలో వినాయక చవితి పండగ వేళ దారుణ ఘటన జరిగింది. అడగకుండా మామిడాకులు కోశాడని.. ఏకంగా ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో పండగ పూట నడిరోడ్డుపై రక్తపు మరకలు కనిపించాయి. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
Andhra Pradesh News Live: Thefts In Floods: వరదల్లో చోరీలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దోపిడీలు.. లబోదిబోమంటున్న బాధితులు
- Thefts In Floods: విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి వారం రోజులైంది. గత ఆదివారం తెల్లవారుజామున బుడమేరుకు గండి పడటంతో వరద నీరు విజయవాడను ముంచెత్తింది.ఈ క్రమంలో ఎక్కడివారక్కడ ఇళ్లకు తాళాలు వేసి కట్టుబట్టలతో వరద నుంచి బయటపడ్డారు.నగరంలోని చాలా ప్రాంతాలు ముంపులో ఉండటంతో కొందరు వాటిని దోచుకోవడం మొదలెట్టారు.
Andhra Pradesh News Live: YS Jagan Questions : 'చంద్రబాబు గారు.. ఇదంతా ఎందుకు జరిగింది..? మీ నిర్లక్ష్యం కారణం కాదా..?' - జగన్ 8 ప్రశ్నలు
- YS Jagan Questions to CM CBN : ఏపీలో వరదలపై సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు. విజయవాడలో ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని... అసలు ప్రభుత్వం ఉందా..? లేదా..? అని నిలదీశారు. బాధితులు కోలుకునేలా ఉదారంగా తగిన సహాయం చేయాలని డిమాండ్ చేశారు.