తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Vigilance : టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు, మరో పది రోజుల పాటు సోదాలు

TTD Vigilance : టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు, మరో పది రోజుల పాటు సోదాలు

HT Telugu Desk HT Telugu

08 July 2024, 14:20 IST

google News
    • TTD Vigilance : గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ అనేక అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదులపై విజిలెన్స్ రంగంలోకి దిగింది. 40 మందితో ప్రత్యేక బృందం టీటీడీలో సోదాలు నిర్వహిస్తోంది. మరో 10 రోజులు సోదాలు జరిగే అవకాశం ఉంది.
టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు, మరో పది రోజుల పాటు సోదాలు
టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు, మరో పది రోజుల పాటు సోదాలు

టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు, మరో పది రోజుల పాటు సోదాలు

TTD Vigilance : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్రమాలపై విజిలెన్స్ సోదాలు ప్రారంభం అయ్యాయి. దాదాపు 40 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ సోదాలను చేపడుతుంది. మరో పది రోజుల పాటు ఈ సోదాలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఇటీవలి జరిగిన ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది.‌ దీంతో గత ప్రభుత్వంలో జరిగిన విషయాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి‌ పెట్టింది. ఇప్పటికే బియ్యం అక్రమ రవాణాపై తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. తాజాగా టీటీడీలో అక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.‌ గత ప్రభుత్వంలో టీటీడీలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులతో విజిలెన్స్ రంగంలోకి దిగింది.

గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన విషయాలపై ఏపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది.‌ విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరిఫ్ ఆధ్వర్యంలో 40 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు మరో పది రోజుల పాటు కొనసాగనున్నాయి. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవన్ లో అధికారులు దస్త్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగం చేపట్టిన నిర్మాణాలు, శ్రీవారి ట్రస్టు నిధులు వినియోగం, వీఐపీ టిక్కెట్లు కేటాయింపు వంటి అంశాలపై విచారణ జరుపుతోంది.

గత ప్రభుత్వ హయంలో టీటీడీలో అనేక అక్రమాలు జరిగాయని జనసేన, బీజేపీ నేతలు ఆరోపించారు. వైసీపీ పాలనలో మంత్రులు దర్శన టిక్కెట్ల చిట్టాను ఇప్పటికే విజిలెన్స్ కి జనసేన అందించింది. వీటిపై విచారణ జరిపి, అక్రమాలపై నిగ్గు తేల్చాలని తిరుపతి నియోజకవర్గం జనసేన నేతలు కిరణ్ రాయల్, సుభాషిణి, మనోజ్ లు విజిలెన్స్ డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీఐసీసీ ఛైర్మన్ గా ఉన్నప్పుడే టీటీడీ సేవా టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజుకు 60 నుంచి 70 టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కొండ మొత్తం డొలిసేశారని, ఇలా అన్ని అక్రమాలపై విజిలెన్స్ సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తరువాత చంద్రబాబు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని. టీటీడీని ప్రక్షాళనం చేస్తామని అన్నారు. ఆ రకంగానే విజిలెన్స్ ను రంగంలోకి దింపారు. విజిలెన్స్ విచారణను వేగవంతం చేసింది. విజిలెన్స్ విచారణ పూర్తి అయిన తరువాత, చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా టీటీడీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.

జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం