తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tirumala Tirupati Devasthanam Pushpa Yagam In Lord Venkateswara Temple

Pushpa Yagam : శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం

HT Telugu Desk HT Telugu

01 November 2022, 20:57 IST

    • Tirumala Tirupati Devasthanam : శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శ్రవణ నక్షత్రంలో చేసే పుష్ప యాగానికి ఎంతో ప్రత్యేక ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల(Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవిత్రమైన కార్తీకమాసం(Kartheeka masaam)లో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని పుష్పయాగ(Pushpa Yagam) మహోత్సవం నిర్వహించారు. సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన చేశారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం కన్నుల పండువగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తిరుమల శ్రీవారి(Tirumala Srivaru) ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో ఉద‌యం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజ‌నం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో అభిషేకం(Abhishekam) చేశారు. మధ్యాహ్నం 1 గంట‌ నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రా భరణాలతో అలంకరించి.. వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం నిర్వహించారు.

చామంతి, సంపంగి, నూరు వరహాలు, రోజా(Roja), గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో శ్రీవారు, అమ్మవార్లను అర్చించారు. ఉద‌యం ఉద్యాన‌వ‌న విభాగం కార్యాల‌యం నుండి శ్రీవారి ఆల‌యం(Srivari Temple) వ‌ర‌కు పుష్పాల ఊరేగింపు వైభ‌వంగా నిర్వహించారు. పుష్పాల దాత‌లు, శ్రీ‌వారి సేవ‌కులు గోవింద‌నామ‌స్మరణ చేస్తూ.. ఊరేగింపులో పాల్గొన్నారు.