తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd News Telugu : ఆ రోజుల్లో 12 గంటలు శ్రీవారి ఆలయ తలుపులు మూత

TTD news telugu : ఆ రోజుల్లో 12 గంటలు శ్రీవారి ఆలయ తలుపులు మూత

HT Telugu Desk HT Telugu

07 September 2022, 17:26 IST

google News
    • Tirumala Tirupati Devasthanam : అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూసివేస్తారు. బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతిస్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

అక్టోబ‌రు 25న మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, విక‌లాంగులు, పిల్లల త‌ల్లిదండ్రులు, రక్షణ సిబ్బంది దర్శనం రద్దు చేసింది టీటీడీ.

దీంతోపాటు ఆర్జిత సేవ‌లైన క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్త్రదీపాలంకార‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతిస్తారు.

న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.40 నుండి రాత్రి 7.20 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు.

ఈ కార‌ణంగా బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, విక‌లాంగులు, పిల్లల త‌ల్లిదండ్రులు, రక్షణ సిబ్బంది, ఎన్ఆర్ఐల దర్శనంతోపాటు ఆర్జిత సేవ‌లైన క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్రదీపాంలకార సేవలను టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

తదుపరి వ్యాసం