TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్… ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల-ttd released special darshan tickets complete details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd: శ్రీవారి భక్తులకు అలర్ట్… ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్… ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

HT Telugu Desk HT Telugu
Jul 06, 2022 11:29 AM IST

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది టీటీడీ. ఇందుకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది.

<p>తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల&nbsp;</p>
తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్ వచ్చేసింది. జూలై 12, 15, 17 తేదీల్లోని రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఈ దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

సెప్టెంబర్ నెలకు సంబంధించి...

ttd special darshan tickets for september 2022: మరోవైపు సెప్టెంబరు నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 7న ఆన్ లైన్‌లో రిలీజ్ చేయనుంది టీటీడీ. సెప్టెంబరు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు వెల్లడించింది.

NOTE:

శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లొచ్చు…

Whats_app_banner