Brahmotsavam | హైదరాబాద్‌లోని టిటిడి ఆలయంలో మార్చి 1 నుంచి బ్రహ్మోత్సవం
మార్చి 1 నుండి మార్చి 9 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌లోని టిటిడి ప్రకటించింది. తిరుమల వైభవాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Hyderabad | వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను హైదరాబాద్‌లో కూడా కన్నులారా వీక్షించే అవకాశం హైదరాబాద్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తోంది. మార్చి 1 నుండి మార్చి 9 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌లోని టిటిడి ప్రకటించింది.
ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కొవిడ్ కారణంగా గతేడాది ఈ వేడుకలు 'ఏకాంతం'గా జరిగాయి. ఈ ఏడాది వేడుకలకు సంబంధించి తితిదే ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, హైదరాబాద్‌లోని టిటిడి మాత్రం వచ్చే నెలలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది..
హైదరాబాద్‌లో కూడా తిరుమల వైభవాన్ని ప్రతిబింబించేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు జూబ్లీహిల్స్‌లోని టిటిడి ఆలయంలో పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1న ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు గరుడపక్షి చిత్రం ఉన్న జెండాను ధ్వజస్తంభానికి ఎగరవేస్తారు. మార్చి 5న గరుడవాహన సేవ, మార్చి 8న రథోత్సవం, మార్చి 9న చక్రస్నానం, మార్చి 10న పుష్పయాగం తదితర కార్యక్రమాలు ఉండనున్నాయి. ఈ వేడుకలున్నన్నీ రోజులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.