ఏప్రిల్ 30న తొలి సూర్యగ్రహణం.. 3 రాశుల వ్యక్తుల జాగ్రత్తగా ఉండాలి!-these 3 zodiac signs will be affected most by april s solar eclipse ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఏప్రిల్ 30న తొలి సూర్యగ్రహణం.. 3 రాశుల వ్యక్తుల జాగ్రత్తగా ఉండాలి!

ఏప్రిల్ 30న తొలి సూర్యగ్రహణం.. 3 రాశుల వ్యక్తుల జాగ్రత్తగా ఉండాలి!

HT Telugu Desk HT Telugu
Apr 28, 2022 08:52 PM IST

ఈ ఏడాది ఏప్రిల్ 30న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారిని ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు జోతిష్య శాస్త్రం చెబుతుంది.

solar eclipse
solar eclipse

ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడబోతోంది. ఈ గ్రహణం కారణంగా సూతక కాలం చెల్లదు. ఈ సూర్యగ్రహణం వైశాఖ మాసం కృష్ణ పక్షం అమావాస్య రోజున ఏర్పడుతుంది. శనిశ్చరి అమావాస్య కూడా ఈ రోజునే వస్తుంది. శనిశ్చరి అమావాస్య, సూర్యగ్రహణం ఒకే రోజున రానునుండంతో, ఇది కొన్ని రాశుల వారిని ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు జోతిష్య శాస్త్రం చెబుతుంది. శాస్త్రం ప్రకారంగా సూర్యగ్రహణం కారణంగా ఏయే రాశులపై ప్రభావం పడుతుందో చూద్దాం.

ఈ రాశిచక్రం వారు జాగ్రత్తగా ఉండండి

మేష రాశి: ఏప్రిల్ 30న ఏర్పడే సూర్యగ్రహణం మేషరాశిలోనే రాబోతుంది. దీంతో మేష రాశి వారిపై ఈ గ్రహణం అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. కావున ఈ రాశివారు ప్రయాణానికి దూరంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. శతృవుల నుండి ప్రమాదం పొంచి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. సూర్య గ్రహణం పమయంలో చంద్రుడు మేషరాశిలో రాహువుతో కలిసి ఉంటాడు. ఈ కారణంగా, కర్కాటక రాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రాశి వారు జాగ్రత్త వ్వవహరించాల్పి ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి, ప్రతికూలత ప్రభావం ఎక్కువగా

వృశ్చిక రాశి: ఈ రాశి వారు గౌరవానికి భంగం కలగవచ్చు. కావున ఏదైనా పని చేసే ముందు ఆలోచించాల్సి ఉంటుంది. శత్రువులు హాని కలిగించవచ్చు. ఇతరులతో వాదనలు వద్దు. సూర్యగ్రహణం ఈ రాశివారి జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఓపికపట్టండి, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు.

 

గమనిక - ఈ కథనంలో ఇవ్వబడిన సమాచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. telugu.hindustantimes.com దీన్ని ధృవీకరించలేదు. మరింత సమాచారం కోసం జ్యోతి శాస్త్ర నిపుణుడిని సంప్రదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం