తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Leaders Questioned The Speaker As To How He Got Admission In The Law Course Without Completing His Graduation

Tammineni Graduation: డిగ్రీ లేకుండా లా అడ్మిషన్.. వివాదంలో స్పీకర్ తమ్మినేని

HT Telugu Desk HT Telugu

27 March 2023, 15:41 IST

  • Tammineni Graduation: డిగ్రీ కోర్సు పూర్తి చేయకుండానే  ఏపీ 

    స్పీకర్  తమ్మినేని సీతారాం లా కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమ్మినేని వ్యవహారంపై సిఐడి దర్యాప్తు చేపట్టాలని, స్పీకర్ సీతారాం పదవికి రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. 

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

Tammineni Graduation: ఏపీ శాసనసభ స్పీకర్ లా అడ్మిషన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. డిగ్రీ మధ్యలో ఆపేసిన స్పీకర్ తమ్మినేనికి ఉస్మానియా యూనివర్శిటీలో లా అడ్మిషన్ ఎలా వచ్చిందని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండో ఏడాదితో కోర్సు ఆపేసినట్లు పేర్కొన్న తమ్మినేని డిగ్రీ ఎప్పుడు పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

డిగ్రీ పాస్ కాకుండా లా కోర్సులో ఎలా చేరారని, డిగ్రీ పూర్తి చేయకుండానే సర్టిఫికెట్‌ ఫోర్జరీ చేసి ఉంటారని కూన రవికుమార్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, సీజేఐ, గవర్నర్‌‌లకు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.

డిగ్రీ విద్యను మధ్యలో ఆపేసిన ఏపీఅసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ఎలా అడ్మిషన్ పొందారని టీడీపీ ప్రశ్నిస్తోంది. డిగ్రీ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసిన తమ్మినేని సీతారాం, ఏ విద్యార్హతతో లా కోర్సులో ప్రవేశం పొందారని ప్రశ్నించారు.

రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌కు ఉస్మానియగా యూనివర్శిటీ అధికారులు ఏమైనా మినహాయింపులు ఇచ్చారా అని ప్రశ్నించారు. తమ్మినేని తన విద్యార్హతలేమిటో బయట పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నారు. నీతి సూత్రాలు వల్లించే తమ్మినేని తన డిగ్రీ చదువు గుట్టేమిటో బయటపెట్టాలన్నారు. ఉస్మానియా అధికారులు నిబంధనల్ని అందరికి మారుస్తారా అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు.

గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందిన తమ్మినేని సీతారాం వ్యవహారాన్ని ఆధారాలతో సహా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ బయటపెట్టారు.

ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారంపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు కొన్ని విలువలు పాటించాలని అన్నారు. తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా వైసీపీ ప్రతిపాదిస్తే.. టీడీపీ, జనసేన కూడా మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా స్పీకర్ ఉండాల్సిన స్పీకర్ అలా ఎప్పుడు వ్యవహరించలేదన్నారు. సభలో సభ్యులు గౌరవాన్ని కాపాడాల్సిన సీతారాం... స్పీకర్ స్థానానికి ఉన్న ఔన్నత్యానికి తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. శాసనసభాపతి స్థానాన్ని తమ్మినేని భ్రష్టుపట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీతారాం ప్రవర్తన ప్రపంచమంతా వీక్షిస్తోందన్నారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌లో ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో డిగ్రీ పూర్తి చేయలేదని నోటరీ చేసి ఇచ్చారన్నారు. 2019లో మహాత్మగాంధీ లా కాలేజీలో లా కోర్స్‌లో చేరారని ఆయన తెలిపారు.

డిగ్రీ పాస్ కాకుండా... బి.ఎల్ కోర్సులో ఏ రకంగా చేరారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి.. డిగ్రీ పూర్తి చేయకుండా... ఎలా సర్టిఫికేట్ పెట్టారని నిలదీశారు. సర్టిఫికేట్ ఫోర్జరీ చేసి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు. సీతారాంకు విలువలు ఉంటే... తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానం గౌరవం కాపాడాలన్నారు.

సీఎం జగన్, స్పీకర్‌ సీతారాంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి, సీజేఐ, గవర్నర్, తెలంగాణ గవర్నర్‌కు టీడీపీ తరుపున స్పీకర్‌పై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేస్తున్నామన్నారు. స్పీకర్ సీతారాం సర్టిఫికేట్‌ల వ్యవహారంపై సీఐడీ ఎంక్వైరీ చేసి విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రికి కూడా లేఖ రాయనున్నట్లు కూన రవికుమార్ పేర్కొన్నారు.

టాపిక్