తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh Shoulder Injury: లోకేష్‌కు ఎమ్మారై స్కాన్, భుజం నొప్పితోనే పాదయాత్ర

Nara Lokesh Shoulder Injury: లోకేష్‌కు ఎమ్మారై స్కాన్, భుజం నొప్పితోనే పాదయాత్ర

HT Telugu Desk HT Telugu

18 May 2023, 9:18 IST

    • Nara Lokesh Shoulder Injury: టీడీపీ నాయకుడు నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడుతున్నారు.  మూడున్నర నెలలుగా లోకేష్ పాదయాత్ర  చేస్తున్నారు. తోపులాటలో జరిగిన గాయంతో  నెలన్నర నుంచి భుజం నొప్పితో సతమతం అవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 
ఎమ్మారై స్కాన్ చేయించుకున్న నారా లోకేష్
ఎమ్మారై స్కాన్ చేయించుకున్న నారా లోకేష్

ఎమ్మారై స్కాన్ చేయించుకున్న నారా లోకేష్

Nara Lokesh Shoulder Injury: టీడీపీ నాయకుడు నారా లోకేష్ భుజం నొప్పితో బాధపడుతున్నారు. దాదాపు నెలన్నర నుంచి లోకేష్ భుజం నొప్పితో సతమతం అవుతున్నారు. ఫిజియోథెరపీ, ఇతర ప్రత్యామ్నయాలు పరిశీలించినా ఫలితం లేకపోవడంతో గురువారం నంద్యాలలో ఎమ్మారై స్కాన్ చేయించుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో 150 ఉద్యోగాలు - నెలకు రూ. 70 వేల జీతం, అర్హతలివే

పాదయాత్రలో భాగంగా నంద్యాలలో పర్యటిస్తున్న లోకేష్ గురువారం ఉదయం నంద్యాల మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో కుడి భుజానికి ఏంఆర్ఐ స్కాన్ చేయించుకున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది. అప్పటి నుండి నొప్పితోనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు.ఫిజియోథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా నొప్పి తగ్గకపోవడంతో స్కానింగ్‌కు వెళ్లారు. 50 రోజులుగా నొప్పి తగ్గకపోవడం తో ఎంఆర్ఐ స్కాన్ చేయించాలని డాక్టర్ల సూచించడంతో గురువారం ఉదయం నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో నారా లోకేష్ స్కాన్ చేయించుకున్నారు.

103వ రోజుకు చేరిన పాదయాత్ర…

మరోవైపు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 103వ రోజుకు చేరింది. పాదయాత్రతోొ నంద్యాల రోడ్లు కిక్కిరిశాయి. లోకేష్ ని చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు.

బుధవారం నంద్యాల పట్టణంలో డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో నంద్యాల దద్ధరిల్లింది. యువనేతకు అడుగడుగునా అపూర్వస్వాగతంతో మహిళలు నీరాజనాలు పలికారు. కనీవినీ ఎరుగనిరీతిలో జనం తరలిరావడంతో ఒకానొక సమయంలో పోలీసులు చేతులెత్తేశారు.

రోడ్డుకి ఇరు వైపులా ఉన్న భవనాలు ఎక్కి లోకేష్ కి ప్రజలు అభివాదం చేశారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులను కలుస్తూ అందరి సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ భరోసా కల్పించారు. కాలనీల్లో తిరుగుతూ పేరుకుపోయిన సమస్యల గురించి తెలుసుకున్నారు.

తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, ఇతర సమస్యల గురించి నంద్యాల వాసులు లోకేష్ ఎదుట చెప్పుకున్నారు. నంద్యాల పట్టణం మూలమఠం నుండి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. యువనేతకు పాదయాత్ర ప్రారంభం నుండే అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు.

రోటరీ కంటి ఆసుపత్రి వద్ద మైనారిటీ యువకులు లోకేష్ కు పూలమాలతో స్వాగతం పలికారు. కరెంటు ఆఫీసు రోడ్డు ప్రారంభం నుండి గాంధీ సర్కిల్ వరకు యువనేతకు మహిళలు అడుగడుగునా హారతులు పట్టి స్వాగతం పలికారు.

నయారా పెట్రోల్ బంక్ వద్ద పార్టీ నాయకులు యువనేతకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. గాంధీ సర్కిల్ వద్ద గాంధీ విగ్రహానికి లోకేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. భవనాశి జ్యూవెలర్ సెంటర్ వద్ద 50అడుగుల భారీ కటౌట్ తో పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజ్ థియేటర్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగ సభకు భారీగా జనం తరలి వచ్చారు. వారినుద్దేశించి యువనేత ప్రసంగించారు. బహిరంగ సభ అనంతరం పాదయాత్రను కొనసాగించారు. యువగళం పాదయాత్రలో ఇప్పటి వరకు 1301.8 కి.మీ పాదయాత్ర సాగింది.