తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Politics: పొత్తులపై చంద్రబాబు హింట్.. త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ కామెంట్స్

AP Politics: పొత్తులపై చంద్రబాబు హింట్.. త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ కామెంట్స్

HT Telugu Desk HT Telugu

06 May 2022, 15:41 IST

    • పొత్తుల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో మాట్లాడిన ఆయన.. ప్రజా ఉద్యమం రావాల్సి ఉందని, అందుకోసం ఎలాంటి త్యాగాలకైనా టీడీపీ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు(ఫైల్ ఫోటో)
పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు(ఫైల్ ఫోటో) (HT)

పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు(ఫైల్ ఫోటో)

ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. 175 స్థానాలను గెలవాలంటూ వైసీపీ అధినేత జగన్.. పెద్ద టార్గెట్ నే ఫిక్స్ చేశారు. ఇక ప్రతిపక్ష టీడీపీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఉత్తరాంధ్రలో పర్యటించారు. తాజాగా కాకినాడ పర్యటనలో ఉన్న ఆయన.. పొత్తులపై కీ కామెంట్స్ చేశారు. ఇవాళ అన్నవరంలో కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. పొత్తుల ప్రస్తావన తెచ్చారు. వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా మరో ప్రజా ఉద్యమం రావాల్సి ఉందన్నారు. ఇందుకోసం అందరమూ కలవాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని.. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Update: పగలంతా మండే ఎండలు, ఉక్కపోత… సాయంత్రానికి చల్లబడిన వాతావరణం ద్రోణీ ప్రభావంతో ఏపీలో వర్ష సూచన

AP IIIT Admissions : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, మే 8 నుంచి అప్లికేషన్లు షురూ

RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

APPSC Marks: ఏపీపీఎస్సీ టౌన్‌ ప్లానింగ్, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్‌ పరీక్షల మార్కుల విడుదల

అయితే చంద్రబాబు వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ ఎదుర్కొనేందుకు కలిసి వచ్చే పార్టీలతో పొత్తుకు సిద్ధమనే విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లే తెలుస్తోంది. అవసరమైతే త్యాగాలకు సిద్ధమేనంటూ కామెంట్స్ చేయటం.. మరింత ఆసక్తిగా మారింది. పొత్తుల్లో భాగంగా ఆయా పార్టీలు అడిగిన సీట్లు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వబోమని జనసేన అధినేత పవన్ స్పష్టం చేశారు. ఈక్రమంలో జనసేన- టీడీపీ పొత్తు ఖరారు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నప్పటికీ.. బీజేపీ రోల్ పై సందిగ్ధత నెలకొంది. జనసేన - బీజేపీ మైత్రి కొనసాగుతుండగా.. టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారా అనేది ఆసక్తికరం.

అంతకుముందు కాకినాడలో తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని ఆయన పిలుపునిచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అరాచక ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని వ్యాఖ్యానించారు. జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

టాపిక్