TDP | కల్తీ సారా నిర్మూలనపై టీటీడీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
17 March 2022, 19:08 IST
- రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, మద్యం షాపుల్లో జె బ్రాండ్స్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నిరసనలు తలపెట్టింది. ఈ మేరకు 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది.
టీడీపీ నిరసనలు
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా ప్రజలతో కలిసి గ్రామ స్థాయి నిరసనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. జంగారెడ్డి గూడెం మరణాలపై ఇప్పటికే అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ సారా, మద్యం షాపుల్లో జె- బ్రాండ్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు 19వ తేదీన.. నిరసనలు చేయనున్నారు.
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మండల కేంద్రాలలో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేస్తారు. జంగారెడ్డి గూడెం మరణాలు సహజ మరణాలు అంటూ సభను సైతం తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి ప్రకటన చేశారని.., టీడీపీ అంటోంది. మరోవైపు నాణ్యత లేని, కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు పోవడంతో పాటు జనారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని పేర్కొంది. వాటిని వెంటనే నిషేధించాలనే డిమాండ్ తో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపింది.
కల్తీ సారా, నాణ్యత లేని జె బ్రాండ్స్ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంపేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇంత జరుగుతున్నా కమీషన్ల కోసమే జగన్ సర్కార్ పనిచేస్తుందని పేర్కొంది.
టాపిక్