తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  South Central Railway Has Announced Special Trains From Secunderabad To Dibrugarh And Danapur

Summer Special Trains: సికింద్రాబాద్ నుంచి దిబ్రూగ‌ఢ్, దానాపూర్‌ ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu

10 May 2023, 12:56 IST

    • Summer Special Trains: వేసవి ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాద్ నుంచి దిబ్రూగఢ్, దానాపూర్‌లకు  దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 
వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవి ప్రత్యేక రైళ్లు

Summer Special Trains: వేసవి ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌, దిబ్రూగఢ్‌కు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బిహార్‌లోని దానాపూర్‌కు, అస్సాంలోని దిబ్రూగఢ్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

సికింద్రాబాద్‌-దానాపూర్‌ మధ్య ట్రైన్ నంబర్ 07419 రైలు మే 13, 20, 27 తేదీల్లో.. ప్రతి శనివారం సాయంత్రం 3.15కి బయల్దేరే రైలు ఆదివారం రాత్రి 11.15 గంటలకు దానాపూర్‌ చేరుకుంటుంది.

దానాపూర్‌-సికింద్రాబాద్‌ మధ్య రైలు నంబరు 07420 మే 15, 22, 29 తేదీల్లో బయలు దేరుతుంది. ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరే రైలు మంగళవారం రాత్రి 11.50కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు రెండు వైపుల కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, బల్లార్ష, నాగ్‌పుర్‌, ఇటార్సి, పిపారియా, జబల్‌పూర్‌, కట్ని, సత్నా, ప్రయాగ్‌రాజ్‌, పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, బక్సర్‌ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

సికింద్రాబాద్‌-దిబ్రూగఢ్‌ మధ్య రైలు నంబరు 07046 మే 15, 22, 29 తేదీల్లో.. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైలు బుధవారం రాత్రి 8.50కి దిబ్రూగఢ్‌ చేరుకుంటుంది.

దిబ్రూగఢ్‌-సికింద్రాబాద్‌ మధ్య రైలు నంబర్ .07047 మే 18, 25, జూన్‌ 1 తేదీల్లో.. ప్రతి గురువారం ఉదయం 9.20 గంటలకు బయల్దేరుతుంది. రైలు శనివారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

రెండు వైపులా ప్రయాణాల్లో రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్లలో ఆగుతాయి. భువనేశ్వర్‌, కటక్‌, న్యూజల్పాయ్‌గురి, గుహవాటి మీదుగా సికింద్రాబాద్‌-దిబ్రూగఢ్‌ల మధ్య రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.