తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Weather Updates : ఏపీలో భానుడి ఉగ్రరూపం - 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, ఇవాళ 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

AP Weather Updates : ఏపీలో భానుడి ఉగ్రరూపం - 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, ఇవాళ 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

06 April 2024, 8:31 IST

google News
    • Andhrapradesh Weather Updates: ఏపీలో భానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో… ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలు, వడగాలుల తీవ్రతతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
ఏపీలో తీవ్ర వడగాల్పులు
ఏపీలో తీవ్ర వడగాల్పులు (unshplash)

ఏపీలో తీవ్ర వడగాల్పులు

Andhrapradesh Weather Updates: ఆంధ్రప్రదేశ్ లో ఎండలు(Heat Waves in AP) దంచికొడుతున్నాయి. ఏప్రిల్ మాసంలోనే…. ఉక్కిరిబిక్కిరి చేసేలా ఎండల తీవ్రత పెరిగిపోతోంది. ఉదయం 10 దాటితే చాలు… బయటికి వెళ్లాలంటే జనాలు జంకుతున్నారు. సాయంత్రం తర్వాతే ఏమైనా పనులు ఉంటే చేసుకుంటున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో వడగాలులు వీస్తుండటంతో…. మధ్యాహ్నం సమయంలో ఎవరూ రోడ్లపైకి రావటం లేదు. 

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇవాళ 179 మండలాల్లో తీవ్రవడగాల్పులు

 ఐఎండి (IMD)సూచనల ప్రకారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. ప్రకటన విడుదల చేసింది. ఇవాళ ఏపీలోని 179 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపు 44 మండలాల్లో తీవ్ర, 193 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు:

తీవ్ర వడగాల్పులు  (severe heat wave alert)వీచే అవకాశం 179 మండలాను చూస్తే…. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 26 ఉన్నాయి. ఇక విజయనగరం25, పార్వతీపురంమన్యం15, అల్లూరిసీతారామరాజు9, విశాఖపట్నం3,అనకాపల్లి16, కాకినాడ13, కోనసీమ జిల్లాలో 7, తూర్పుగోదావరి16, ఏలూరు4, కృష్ణా4, ఎన్టీఆర్6, గుంటూరు14, పల్నాడు17, బాపట్ల1, ప్రకాశం2, తిరుపతి జిల్లాలోని ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆయా మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఈ నాలుగు రోజుల పాటు క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 6 శనివారం:

  •  శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 
  • అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, నంద్యాల, వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • కోనసీమ, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్‌ 7 ఆదివారం:

  •  విజయనగరం, పార్వతీపురంమన్యం, పల్నాడు, నంద్యాల, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40-41 డిగ్రీల ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

 ఏప్రిల్‌ 8 సోమవారం

  • విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం,  నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 37°C-40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

 ఏప్రిల్‌ 9 మంగళవారం

  • విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం వైయస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-40 డిగ్రీల ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
  • విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 35°C-39 డిగ్రీల ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

శుక్రవారం అనకాపల్లి జిల్లా దేవరపల్లి, వైయస్సార్ జిల్లా పోరుమామిళ్లలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రలు నంద్యాల జిల్లా బనగానపల్లెలో 44.4, శ్రీకాకుళం జిల్లా జి. సిగడాంలో 44.2, అనంతపురం జిల్లా పాతకొత్తచెరువు, బాపట్ల జిల్లా జనకవరం పంగులూరు, ప్రకాశం జిల్లా గుండ్లపల్లె,విశాఖ జిల్లా పద్మనాభంలో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 18 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే 94 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 159 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవాలని సూచించారు.

తదుపరి వ్యాసం