AP IMD Alert: ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలకు వర్ష సూచన… ఐఎండి అలర్ట్
AP IMD Alert: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP IMD Alert: ఐఎండి అంచనాల ప్రకారం జార్ఖండ్ jarkhand నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర North Coast వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు.
బుధవారం Andhrapradesh లోని అల్లూరిసీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
మిగిలినచోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండరాదన్నారు. పొలాలు, మైదానాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
ఖరీఫ్‌లో పంట చేతికి అందే సమయంలో మిచాంగ్ తుఫాను విరుచుకు పడటంతో ఏపీలో భారీగా పంట నష్టం వాటిల్లింది. రైతులు కోలుకోలేని విధంగా రాష్ట్రమంతటా పంట తుడుచుకుపోయింది. రబీలో పంటలు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఏడాది గణనీయంగా తగ్గిన పంటలు…
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఓవైపు భారీ వర్షాలు, తుఫాన్లు ముంచెత్తితే, రాయలసీమ ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువ రాష్ట్రాల్లో వానలు లేకపోవడంతో జలాశయాలు కూడా నిండుకున్నాయి. ఈ ఏడాది సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తున్నారు.
మరోవైపు సరిగ్గా అరకొరగా పండిన పంటలు చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాల రైతుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అంతంత మాత్రంగా ఉంటుండటంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో ఉండటంతో వర్షాలకు దెబ్బతిన్న పంటల్ని ఆదుకునే అవకాశం కూడా ఉండదని చెబుతున్నారు.