తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sajjala On Bifurcation : మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలి.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala On Bifurcation : మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలి.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu

08 December 2022, 15:48 IST

    • Sajjala Ramakrishna Reddy Comments : విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంకోర్టులో కేసు ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మెుదటి నుంచి పోరాటం చేస్తున్నది వైసీపీనేనని చెప్పారు.
సజ్జల రామకృష్ణారెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి (facebook)

సజ్జల రామకృష్ణారెడ్డి

విభజన(Bifurcation)పై సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే వైసీపీ విధానమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేస్తుంది వైసీపీ(YCP)నేన్నారు. అప్పట్లో టీడీపీ(TDP), కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని ఆరోపించారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే మెుదట స్వాగతించేది వైసీపీనేనని సజ్జల స్పష్టం చేశారు.

'విభజనకు వ్యతిరేకంగా కోర్టు(Court)ల్లో మా వాదనలు బలంగా వినిపిస్తాం. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే సరిదిద్దాలని కోరుతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసులు వేశారు. విభజన చట్టం అసంబద్ధం. ఇప్పటికే సుప్రీంకోర్టు(Supreme Court)లో కేసు ఉంది. ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే.. మెుదట స్వాగతించేందికి వైసీపీనే.' అని సజ్జల అన్నారు.

ఉండవల్లి వ్యాఖ్యలు అసంబద్ధమైనవని సజ్జల స్పందించారు. విభజనకు వ్యతిరేకంగా మెుదటి నుంచి వైసీపీ పోరాటం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్(Congress), టీడీపీ పార్టీలు.. విభజనకు అనుకూలంగా వ్యవహరించాయని ఆరోపించారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనను బలంగా వినిపిస్తామని, లేకుంటే.. సరిదిద్దాలని గట్టిగా అడుగుతామని స్పష్టం చేశారు సజ్జల. విభజన చట్టంలోని హామీల అమలుపై ఇప్పటి పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశిస్తే.. అంతకంటే ఏం కావాలి అని సజ్జల కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా బీసీ(BC)లపై సజ్జల మాట్లాడారు. వారిని అన్ని రంగాల్లో ప్రొత్సహించిన ఘనత వైఎస్ జగన్ దని చెప్పారు. బీసీ డిక్లరేషన్ అమలుతో జగన్‌పై విశ్వాసం పెరిగిందన్నారు. రాష్ట్రానికి ప్రథమ శత్రువు చంద్రబాబు(Chandrababu) అని, బీసీ సభ సక్సెస్‌ను జీర్ణించుకోలేక విషం కక్కుతున్నారని సజ్జల మండిపడ్డారు.