తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సిగ్నల్ కోసం ఆగిన రైలు.. గుత్తిలో దోపిడి దొంగల బీభత్సం

సిగ్నల్ కోసం ఆగిన రైలు.. గుత్తిలో దోపిడి దొంగల బీభత్సం

HT Telugu Desk HT Telugu

09 April 2022, 6:28 IST

    • గుత్తిలో శుక్రవారం రాత్రి భారీ రైలు దోపిడి జరిగింది.సిగ్నల్‌ కోసం వేచి చూస్తున్న సమయంలో ఓ రైల్లోకి ప్రవేశించిన దుండగులు ప్రయాణికులను దోచుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైలులో అర్ధరాత్రి భారీ దోపిడి....
రైలులో అర్ధరాత్రి భారీ దోపిడి....

రైలులో అర్ధరాత్రి భారీ దోపిడి....

అనంతపురం జిల్ల గుత్తిలో శుక్రవారం రాత్రి భారీ రైలు దోపిడి జరిగింది. తిరుపతి నుంచి సికింద్రబాద్ ప్రయాణిస్తోన్న సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి 9.10కు గుత్తి చేరుకోవాల్సి ఉంది. గంటన్నర ఆలశ్యంగా 11గంటల ప్రాంతంలో గుత్తి సమీపంలోకి వచ్చాక ప్లాట్‌ఫాంలు ఖాళీ లేకపోవడంతో స్టేషన్ శివార్లలో రైలు నిలిచిపోయింది. సిగ్నల్‌ కోసం వేచి చూస్తున్న సమయంలో రైల్లోకి ప్రవేశించిన దుండగులు ప్రయాణికులను దోచుకున్నారు. 

మారణాయుధాలతో బెదిరించి ప్రయాణికుల నుంచి నగదు, బంగారాన్ని లాక్కున్నారు. నిమిషాల వ్యవధిలో పలు బోగీలలో ప్రయాణికుల నుంచి బంగారం లాక్కుని పరారయ్యారు. నిందితుల కోసం అనంతపురం పోలీసులతో పాటు, రైల్వే పోలీసులు గాలింపు ప్రారంభించారు. గుత్తి రైల్వే స్టేషన్లో ఫిర్యాదు నమోదైన తర్వాత రైలు సికింద్రాబాద్ బయలుదేరి వెళ్లింది.

టాపిక్