తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh Rain Alert : ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

Andhra Pradesh Rain Alert : ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు

HT Telugu Desk HT Telugu

01 November 2022, 19:03 IST

    • AP Weather Alert : నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిశాయి.
ఏపీలో వర్షాలు
ఏపీలో వర్షాలు

ఏపీలో వర్షాలు

నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక తీరం, ఉత్తర శ్రీలంక తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మరోసారి భారీ వర్షాలు(Rains) కురవనున్నాయి. అల్పపీడన ద్రోణి ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య గాలులు వీయడంతోపాటు నైరుతి బంగాళాఖాతంలో మరో వాయుగుండంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సోమవారం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా, మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిశాయి. బుధవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్(Yellow Alert) కూడా జారీ చేశారు. నెల్లూరు(Nellore) జిల్లాలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ(IMD) తెలిపింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతిలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు రోజులపాటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాలతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు(Tamil Nadu) తీరంలో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్టుంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో అల్పపీడనం ప్రభావం చూపుతుంది. కోస్తాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉంటుంది.

విశాఖ, విజయవాడ, కాకినాడ(Kakinada), రాజమండ్రి నగరాల్లో తేలికపాటి వర్షాలు ఉండనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్నిటికంటే తక్కువగా వర్షాలు ఉంటాయి. నవంబర్ 2, నవంబర్ 3న వైజాగ్, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో తక్కువ వర్షాలు ఉంటాయి. ఉత్తర కోస్తాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం నవంబర్ 2, 3 తేదీల్లో చలి గాలులు వీయనున్నాయి.