తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Woman Killed In Ac Blast : ప్రకాశం జిల్లాలో విషాద ఘటన- ఏసీ పేలి మహిళ మృతి, కొడుకు పరిస్థితి విషయం!

Woman Killed In AC Blast : ప్రకాశం జిల్లాలో విషాద ఘటన- ఏసీ పేలి మహిళ మృతి, కొడుకు పరిస్థితి విషయం!

31 May 2023, 10:02 IST

    • Woman Killed In AC Blast : ఏసీ పేలిన ఘటనలో మహిళ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. హైవోల్టేజీ కారణం ఏసీ పేలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఏసీ పేలి మహిళ మృతి
ఏసీ పేలి మహిళ మృతి

ఏసీ పేలి మహిళ మృతి

Woman Killed In AC Blast : ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం పెట్టుకున్న ఏసీ ప్రాణం తీసింది. ఇంట్లో ఏసీ వేసుకుని తల్లి, కొడుకు నిద్రపోతున్నారు. అయితే హైవోల్టేజీ కారణంగా ఏసీ ఒక్కసారిగా పేలింది. అందులో నుంచి వచ్చిన విషవాయువులను పీల్చడంతో మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో మహిళ మృతిచెందింది. కుమారుడి పరిస్థితి కూడా విషయంగా ఉందని వైద్యులు అంటున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

Bezawada Caste Politics: బెజవాడలో అంతే, తలచుకుంటే రైల్వే లైన్లు కూడా తీయిస్తారు, కులం కోసమే ఏమైనా చేస్తారు..

AP LAWCET 2024 Updates : ముగియనున్న 'ఏపీ లాసెట్' దరఖాస్తు గడువు - వెంటనే అప్లయ్ చేసుకోండి

అసలేం జరిగింది?

ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏసీ పేలిన ఘటనలో మహిళా ఉద్యోగి మృతి చెందారు. మహిళ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని పల్లపోతు వారి వీధిలో దామర్ల శ్రీదేవి (52) అనే మహిళ, తన కుమారుడు సాయితేజతో కలిసి నివాసం ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం భర్త వెంకట సుబ్బారావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ చనిపోయారు. కారుణ్య నియామకం కింద శ్రీదేవి ఉద్యోగం పొందారు. ఒంగోలు జడ్పీ కార్యాలయంలోని పీఎఫ్‌ విభాగంలో శ్రీదేవి విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే తల్లి,కొడుకులు ఇంట్లో ఏసీ వేసుకొని నిద్రపోతున్నారు. ఎండలు తీవ్రత, హైవోల్టేజీ రావడంతో ఏసీ ఒక్కసారిగా పేలిపోయింది. నిద్రలో ఉన్న తల్లి,కొడుకులు ఏసీ నుంచి విడుదలైన విషవాయువులను పీల్చారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఒంగోలులోని హాస్పిటల్ కు తరలించారు. అయితే శ్రీదేవి పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఏసీ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో రోజంతా ఏసీలోనే ఉండేందుకు ఇష్టపడతాం. రోజంతా ఏసీ రన్ అవుతూనే ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఏసీ ఎక్కువగా ఉపయోగించే వాళ్లు కచ్చితంగా ఈ టిప్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఏసీ పాడైపోయే, పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఏసీ ఎక్కువగా వాడడం వల్ల వైర్లపై ఒత్తిడిపడుతుంది. దీంతో ఏసీ పేలిపోయే అవకాశం ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయిస్తూ ఉండాలి. అప్పుడు ఏసీ తొందరగా పాడవదు. ఒకవేళ క్లీన్ చేయకపోతే ఏసీ పేలపోయే ప్రమాదం ఉంది. ఏసీని కనెక్ట్ చేస్తున్న సాకేట్ న్యూట్రల్ కనెక్షన్ రెండు గట్టిగా ఉండేలా చూసుకోవాలి. వదులుగా ఉండటం వలన నిప్పులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విధంగా అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. 1.5 టన్ ఏసీ కోసం ఎప్పుడు ఫోర్ ఎంఎం మల్టీప్లెక్స్ వైర్ ని వినియోగించాలి. ఏసీకి విద్యుత్ సరఫరా చేసే వైర్ల మందం ఫోర్ ఎంఎం కంటే తక్కువ ఉంటే ఆ వైర్ స్విచ్ బోర్డ్ లో మంటలను చెలరేగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ తప్పును లేకుండా వైర్లను ఎంచుకోవాలి.