తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Perni Nani Sensational Comments On Pawan Kalyan

Perni Nani On Pawan : మైకు ముందు పవన్ నటన సూపర్.. మోదీతో ఏం మాట్లాడితే మాకెందుకు?

HT Telugu Desk HT Telugu

27 November 2022, 18:28 IST

    • Perni Nani Comments : సీఎం వైఎస్‌ జగన్‌ పట్ల విద్వేషం తప్ప పవన్‌ మాటల్లో ఇంకేమీ లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సమాజం కోసం పవన్‌ మాట్లాడింది ఏమీలేదని విమర్శించారు.
మంత్రి పేర్ని నాని
మంత్రి పేర్ని నాని

మంత్రి పేర్ని నాని

పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ మైకు ముందు తన నటనతో అందరినీ అలరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఊకదంపుడు ఉపన్యాసంతో హడావుడి చేశారని విమర్శించారు. చంద్రబాబు(Chandrababu) కళ్లలో ఆనందం కోసమే పవన్ తాపత్రయపడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. సీఎం జగన్(CM Jagan)పై విద్వేషం తప్ప ఇంకేమీ లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

'సమాజం కోసం పవన్‌(Pawan) మాట్లాడింది ఏం లేదు. పవన్ కల్యాణ్ ను నమ్మితే.. కుక్కతోట పట్టుకుని గోదావరి(Godavari) ఈదినట్టే. ఎవరో రాసిన స్క్రిప్ట్ పవన్ చదివి వినిపించారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడలను నోటీసులు ఇచ్చి మరి తొలగించారు. ఇప్పటం(Ippatam)లో ఏం కూలలేదు. అక్కడి వాళ్లే ఈ విషయాన్ని చెబుతున్నారు. ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటం గ్రామం పరువు తీసింది ఎవరు? కోర్టు మెుట్టికాయలు వేసినా బుద్ధి రాలేదు. పవన్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది. కోర్టు విధించిన జరిమానా ఎవరు చెల్లించాలి? చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వంలో పొలాలను నాశనం చేసినప్పుడు పవన్ కు ఏం కాలేదా?' అని పేర్ని నాని అన్నారు.

పవన్ నోరు తెరిస్తే.. అన్నీ అబద్ధాలేనని పేర్ని నాని విమర్శించారు. పవన్ విధానాలను చూసే ప్రజలు ఓటు వేయలేదన్నారు. 2024లో కూడా ప్రజలు ఓటు వేయరన్నారు. ఇదే నిజమన్నారు. పవన్ మాటలు, వీడియోలు మ్యూజియంలో పెట్టాలని చెప్పారు. మంచి పరిపాలన అందిస్తే.. సినిమాలు చేసుకుంటా అన్నది పవనేనన్నారు. ఎన్నికలెఎన్నికలకు పవన్(Pawan) ఒక్కో జెండా మారుస్తారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక వ్యూహం.., లేదంటే మరో వ్యూహమని విమర్శించారు. ఊసరవెల్లిలా వ్యూహాలు మార్చే వ్యక్తి పవన్‌ అని మండిపడ్డారు. వీకెండ్‌ పొలిటీషన్‌(Weekend Politician) పవన్‌ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తే.. పవన్ ఏమయ్యారు. ఆయన కాళ్ల దగర చోటు ఉంటే.. చాలు అన్నది పవన్ ఆలోచన. పరిపాలనతో ప్రజలకు సీఎం జగన్(CM Jagan) మరింత దగ్గరయ్యారు. పవన్ ఏం అంటారో ఆయనే తెలియదు. మోదీ(Modi)తో పవన్ ఏం మాట్లాడితే మాకు ఎందుకు. రూట్ మ్యాప్ మోదీ ఇవ్వాలి అని అడుగుతారు. పార్టీ స్థాపించి.. రూట్ మ్యాప్ కావాలని అడుగుతారా? ముఖ్యమంత్రి జగన్ మీద పడి ఏడ్చేది ఎవరు? 2014లో పార్టీ పెట్టి.. పోటీ చేయనిది ఎవరు? అందరు హీరోల అభిమానులు సీఎం జగన్ ను గుండెల్లో పెట్టుకుంటారు. 2024లో వైసీపీకి 175 సీట్లు వస్తే.. పవన్ చూస్తూనే ఉంటారు.

- పేర్ని నాని